- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Japanese beauty : జపనీస్ బ్యూటీ సీక్రెట్.. వాళ్లు తినే ఆహారమేనా?
దిశ, ఫీచర్స్ : ఈ మధ్య జపనీస్ కల్చర్, జపనీస్ కిచెన్, జపనీస్ ఫుడ్, జపనీస్ బ్యూటీ వంటి విషయాలు తరచుగా వినిపిస్తున్నాయి. అందుకు కారణం అక్కడి ప్రజలు అందంగా, ఆరోగ్యంగా ఉండటమే కాకుండా, వారి ఆయుఃప్రమాణం కూడా ఎక్కువే అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా జపనీస్ తాము తీసుకునే ఆహారాల్లో అన్ని పోషకాలు, విటమిన్లు, మినరల్స్ ఉండేలా చూసుకుంటారని, అవి చర్మ నిగారింపును పెంచి, యంగ్‌గా కనిపంచేలా చేస్తాయని చెప్తున్నారు. అలాంటి అందాన్ని పెంచే కొన్ని ఆహారాలు, పానీయాల గురించి తెలుసుకుందాం.
*మాచా టీ : మాచా అనేది వాస్తవానికి జపనీస్ పద్ధతిలో తయారు చేసే గ్రీన్ టీ. దీని కోసం వారు ‘మాచా’ ఆకులను వాడుతారు. వీటిని మెత్తగా గ్రైండ్ చేయడం ద్వారా, పొడి చేయడం ద్వారా కూడా తినవచ్చునట. ఇది సాధారణ గ్రీన్ టీకి భిన్నంగా ఉంటుంది. ఇందులో పాలీ ఫెనాల్స్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ కార్సినోజెనిక్ లక్షణాలు ఉంటాయి. తరచుగా తీసుకోవడం ఆరోగ్యానికి, అందానికి మెడిసిన్‌లా పనిచేస్తుందని చెప్తారు.
*నాటో ఫుడ్ : పులియబెట్టిన సోయాబీన్స్‌తో తయారు చేసే జపనీస్ సంప్రదాయ ఆహారమే నాటో. దీనిని అన్నంతో కలిపి తీసుకుంటారు. రుచిగా ఉండటమే కాకుండా అది చర్మ ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిని తినడంవల్ల కొల్లాజెన్ పుష్కలంగా లభిస్తుంది. స్కిన్ స్మూత్‌గా, ఫేస్ గ్లోగా మారుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.
*చిలగడ దుంప : జపాన్‌లో వీటికి డిమాండ్ ఎక్కువ. అక్కడి సూపర్ మార్కెట్లు, ఫుడ్ స్టాల్స్‌లతో పాటు వీధి దుకాణాల్లోనూ ఎల్లప్పుడూ లభిస్తాయి. వీటిని ఉడకబెట్టి తినడం, ఆహారంలో భాగంగా వివిధ వంటకాల్లో మిక్స్ చేయడం చేస్తుంటారు జపనీయులు. ఇందులోని విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు చర్మ ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి.
*సాల్మన్ ఫిష్ : ఇందులో ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ డి, విటమిన్ బి, ప్రోటీన్లు, బయోటిన్‌లు వంటి పోషకాలు ఉంటాయి. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు కూడా ఉంటాయి. మొటిమలను తగ్గించడంలో, స్కిన్ గ్లోను పెంచడంలో అద్భుతంగా పనిచేస్తాయి. ఇక విటమిన్ బి అయితే శరీరంలో తేమను నిలుపుకోవడంలో, అందాన్ని పెంచడంలో సహాయపడుతుంది. చర్మాన్ని మృదువుగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ విధమైన ఆహార పద్ధతులే జపనీస్ హెల్త్ అండ్ బ్యూటీ సీక్రెట్స్‌గా పలువురు పేర్కొంటున్నారు.