Ear Itching : చలికాలంలో చెవిలో దురద.. ఈ కారణాలవల్ల కూడా కావచ్చు!

by Javid Pasha |
Ear Itching : చలికాలంలో చెవిలో దురద.. ఈ కారణాలవల్ల కూడా కావచ్చు!
X

దిశ, ఫీచర్స్ : చలి కాలంలో సాధారణంగా తలెత్తే సీజనల్ సమస్యల్లో చెవిపోటు, చెవిలో దురద, ఏవో వింత శబ్దాలు వినిపించడం వంటివి కూడా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెప్తు్న్నారు. ముఖ్యంగా అత్యధిక మందిని దురద సమస్య వేధిస్తుంది. దీంతో అగ్గిపుల్లలకు దూది చుట్టి కొందరు, పిన్నీసులు పెట్టి కొందరు చెవిలో గోక్కుంటూ ఉంటారు. అయితే ఈ దురద సమస్య రెగ్యులర్‌గా వస్తోంటే మాత్రం ఇయర్ వాక్స్ (Ear wax) పేరుకుపోవడం లేదా ఏదైనా వ్యాధి లక్షణం కూడా కావచ్చు అంటున్నారు నిపుణులు.

బయటి పరిసరాల్లో తిరుగుతున్నప్పుడు దుమ్ము, ధూళి కణాలు చెవుల్లోకి చేరుతుంటాయి. చెవి గోడలపై పేరుకుపోతుంటాయి. చల్లటి గాలి చెవి లోపలికి ప్రవేశిస్తూ ఉంటుంది. ఇలాంటి కారణాల వల్ల కూడా దురద, వింత శబ్దాలు వస్తాయని నిపుణులు చెప్తున్నారు. కాబట్టి చెవిలో మురికి పేరుకుపోయినట్లు గమనించగానే కాటన్ బడ్‌తో శుభ్రం చేసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అలాగే డాక్టర్ల సలహాతో ఇయర్ డ్రాప్స్ కూడా వాడొచ్చు. చలికాలంలో జలుబు, అలర్జీలు, ఇన్‌ఫెక్షన్లు, ఎగ్జిమా, సోరియాసిస్ వంటి సమస్యలు కూడా చెవిలో దురద రావడానికి కారణం అవుతుంటాయని చెవి, ముక్కు, గొంతు వైద్య నిపుణులు అంటున్నారు. సమస్య ఏదైనా వైద్య నిపుణుల సలహా పాటించడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story