- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Ponguleti Srinivas Reddy: అదే జరిగితే కేటీఆర్, హరీశ్ రావే కాదు కేసీఆర్, కవితకు సైతం శిక్ష: పొంగులేటి
దిశ, డైనమిక్ బ్యూరో: గత బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వంలో తప్పు చేసిన ఏ నాయకుడైనా శిక్ష అనుభవించక తప్పదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) హాట్ కామెంట్స్ చేశారు. తప్పులు చేసినట్లు తేలితే కేటీఆర్ (KTR), హరీశ్ రావు (Harish Rao)మాత్రమే కాదు, కేసీఆర్ (KCR), కవితకు (Kavitha) సైతం శిక్ష తప్పదన్నారు. తప్పులు చేసిన వారు భుజాలు తడుముకుంటున్నారని సెటైర్ వేశారు. శుక్రవారం ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా మాట్లాడిన ఆయన.. గుమ్మడికాయల దొంగ అంటే కేటీఆర్ భుజాలు తడుముకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఫార్ములా-ఈ రేస్ (Formula-E Racing) కేసు వ్యవహారంలో కేటీఆర్ అరెస్టు అవుతానని ముందుగానే మానసికంగా సిద్ధం అవుతున్నారని విమర్శించారు. అందుకే ఈ అంశంలో రాజకీయంగా లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కార్ల రేసింగ్ పై అనేక విమర్శలు వచ్చాయని అసలు ఈ రేసింగ్ తో తెలంగాణకు వచ్చిన ప్రయోజనం ఏంటని ప్రశ్నించారు. నా వ్యాఖ్యలు ఏ వ్యక్తినో ఏ పార్టీనో టార్గెట్ చేసి మాట్లాడుతున్నవి కావని విచారణలో ఎవరు దోషులని తేలినా శిక్ష అనుభవించాల్సిందేనన్నారు. మీకు ఇన్ని లక్షల కోట్ల సంపద ఎక్కడి నుంచి వచ్చిందో తెలంగాణ ప్రజలకు తెలుసన్నారు.