- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
CM Chandrababu:శ్రీశైలానికి మహర్దశ.. రేపు సీ ప్లేన్‌ను లాంఛనంగా ప్రారంభించనున్న సీఎం
దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) రాష్ట్రాభివృద్ది(State Development) దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే సీఎం చంద్రబాబు(CM Chandrababu) ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు మరో నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్య క్షేత్రం శ్రీశైలంలో రేపు(శనివారం)సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ క్రమంలో శ్రీశైలం పాతాళగంగ లోని కృష్ణానది , బెజవాడ ప్రకాశం బ్యారేజీ ల్యాండింగ్ పాయింట్లుగా సీ ప్లేన్ సర్వీసును లాంఛనంగా ప్రారంభించనున్నారు. దీంతో శ్రీశైలం ప్రాజెక్టుకు ఆ పరిధిలో ఉన్న స్థలాలకు మహర్దశ పట్టనుంది. దీంతో సీఎం చంద్రబాబు పర్యాటక అభివృద్ధి పై ప్రత్యేక ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ సీ ప్లేన్ సర్వీస్ కోసం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కృషి చేశారు. ఈ (సీప్లేన్) నీటి విమానం పర్యాటకంగా అభివృద్ధికి ఎంతగానో దోహదం చేసేందుకు ముందడుగుగా చెప్పవచ్చు.