KA Paul: సుప్రీంకోర్టులో కేఏ పాల్ కు చుక్కెదురు

by Rani Yarlagadda |
KA Paul: సుప్రీంకోర్టులో కేఏ పాల్ కు చుక్కెదురు
X

దిశ, వెబ్ డెస్క్: ప్రజాశాంతి పార్టీ (Prajashanti Party) అధ్యక్షుడు కేఏ పాల్ (KA Paul) కు సుప్రీంకోర్టు(Supreme Court)లో షాక్ తగిలింది. తిరుమల (Tirumala)ను కేంద్రపాలిత ప్రాంతం చేయాలన్న పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. దేశంలో ఎన్నో దేవాలయాలున్నాయన్న సుప్రీంకోర్టు.. తిరుమలను కేంద్రపాలిత ప్రాంతం చేయడం కుదరదని తేల్చి చెప్పింది. దీనిపై కేఏ పాల్ తనదైన రీతిలో స్పందించారు. తిరుమలను కేంద్రపాలిత ప్రాంతం చేయాలని తాను వేసిన పిటిషన్ ను విచారించేందుకు సుప్రీంకోర్టు కేవలం 5 నిమిషాలే సమయం ఇచ్చిందన్నారు. కోట్లాదిమంది హిందువులకి సంబంధించిన అంశంపై విచారణ చేసేందుకు కోర్టు ఎక్కువ సమయం కేటాయించలేదని వాపోయారు. తిరుమలలో మతపరమైన స్వేచ్ఛకు విఘాతం కలుగుతోందని కేఏపాల్ ఆరేపించారు. ముస్లింలు, క్రిస్టియన్లు తమ మసీదులు, చర్చిలను తామే నిర్వహించుకుంటున్నట్లు హిందూ ఆలయాలను హిందూ అర్చకులే నిర్వహించుకోవాలని సంచలన వ్యాఖ్యలు చేశారు.

తిరుపతిని కేంద్రపాలిత ప్రాంతం చేసే అంశంపై సుప్రీంకోర్టులో మరోసారి రివ్యూ పిటిషన్ వేస్తానన్నారు కేఏ పాల్. లడ్డూ కల్తీ వ్యవహారంపై దర్యాప్తుకు 3-6 నెలల సమయం ఉండేలా ఆదేశాలివ్వాలని డిమాండ్ చేశారు. తిరుమలలో హిందూ - క్రిస్టియన్ గొడవలు జరగకుండా ఉండాలంటే తిరుమలను కేంద్రపాలిత ప్రాంతం చేయాలన్నారు. ఇందుకు వాటికన్ సిటీని ఉదాహరణగా చూపించారు. తిరుమల వ్యవహారంపై మాత్రం తమ పోరాటం కొనసాగుతుందని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed