- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Ola Electric : ఓలా ఈవీ షోరూమ్ వద్ద కస్టమర్ వినూత్న నిరసన.. వీడియో వైరల్
దిశ, డైనమిక్ బ్యూరో: (Ola Electric) ఓలా ఈవీ షోరూం దగ్గర ఓ కస్టమర్ (Customer) వినూత్న నిరసన తెలియజేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో తాజాగా నెట్టింట వైరల్ అవుతోంది. హైదరాబాద్- లింగంపల్లిలోని అశోక్‌నగర్ షోరూమ్‌లో ఈ ఘటన జరిగింది. ఓలా ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాటరీ రేంజ్ ఒక్కసారిగా పడిపోవడంతో నెలక్రితం షోరూమ్‌లో వాహనాన్ని ఇచ్చినట్లు కస్టమర్ తెలిపారు. దీంతో నెలల తరబడి షోరూమ్ చుట్టూ తిప్పించుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన కస్టమర్ షోరూమ్‌కు చెప్పుల దండ వేసి నిరసన తెలియజేశారు. బ్యాన్ ఓలా, ఓలా మేకింగ్ హౌలా అంటూ కస్టమర్ షోరూమ్ ముందు ప్లకార్డులు ప్రదర్శించాడు.
కస్టమర్‌కు న్యాయం చేయాలని దీనికి సంబంధించిన వీడియోను నెటిజన్లు ఓలా సర్వీస్ సెంటర్‌కు ట్యాగ్ చేస్తున్నారు. కాగా, గత కొంత కాలంగా ఓలా కస్టమర్ సర్వీస్‌పై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. సర్వీస్ సరిగా లేదని గతంలో కర్ణాటకలోని కలబుర్గిలో ఓ కస్టమర్ ఓలా ఎలక్ట్రిక్ షోరూమ్‌ను తగలబెట్టిన విషయం తెలిసిందే.