YS Jagan: మాజీ సీఎం జగన్ పిటిషన్ పై విచారణ వాయిదా

by Jakkula Mamatha |
YS Jagan: మాజీ సీఎం జగన్ పిటిషన్ పై విచారణ వాయిదా
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఇటీవల వైఎస్ జగన్(YS Jagan), వైఎస్ షర్మిల(YS Sharmila) ఆస్తుల వివాదం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. మాజీ సీఎం జగన్ తమ కుటుంబ ఆస్తుల వ్యవహారంలో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్(National Company Law Tribunal)లో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌లో ఆయన తన తల్లి విజయమ్మ, చెల్లి షర్మిలను ప్రతివాదులుగా పేర్కొనడం సంచలనం సృష్టించింది. తనకు సమాచారం అందించకుండా తల్లి, సోదరి షేర్లు బదిలీ చేసుకున్నారని జగన్ తన పిటిషన్ లో ఆరోపించారు.

షేర్ల బదిలీ ఫారాలు సమర్పించకుండానే తమ పేరిట మార్చుకున్నారని వివరించారు. జగన్, వైఎస్ భారతి, క్లాసిక్ రియాలిటీ పేరిట షేర్లు కొనసాగేలా ఆదేశాలు ఇవ్వాలని తన పిటిషన్‌లో కోరారు. 51.01 శాతం షేర్లు యథావిధిగా కొనసాగేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈక్రమంలో నేడు(శుక్రవారం) NCLT ఈ పిటిషన్ పై విచారణ చేపట్టింది. ఈ పిటిషన్ పై వాదనల అనంతరం కౌంటర్ దాఖలు చేసేందుకు కొంత సమయం కావాలని విజయమ్మ, షర్మిల తరఫున న్యాయవాది ఎన్సీఎల్టీని కోరారు. ఈ క్రమంలో ఎన్సీఎల్టీ విచారణను డిసెంబర్ 13కు వాయిదా వేసింది.

Advertisement

Next Story

Most Viewed