- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏసీబీకి చిక్కిన వర్ని ఎస్సై కృష్ణకుమార్
దిశ, ప్రతినిధి, నిజామాబాద్ నవంబర్ ౦8: నిజామాబాద్ జిల్లా వర్ని ఎస్ఐ కృష్ణకుమార్ శుక్రవారం ఓ బాధితుడి వద్ద రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా చిక్కారు. ఏసీబీ డీఎస్పీ శేకర్ గౌడ్ తన సిబ్బందితో కలిసి రైడ్ చేసి బాధితుడి వద్ద ఎస్ఐ లంచం తీసుకుంటుండగా..రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ ఘటన జిల్లాలో,ఉద్యోగ వర్గాల్లో కలకలం రేపింది. వర్ని మండలం కోటయ్య క్యాంపుకు చెందిన నాగరాజు అనే రైతుకు ఐదు రోజుల క్రితం ఓ వ్యక్తితో వర్ని మండల కేంద్రంలో గొడవ జరిగింది. ఈ గొడవ కాస్త పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. దీంతో ఈ కేసులో ఎస్ఐ కృష్ణకుమార్ నాగరాజుపై కేసు నమోదు చేశారు. నాగరాజుకు స్టేషన్ బెయిల్ ఇవ్వడానికి ఎస్ ఐ కృష్ణకుమార్ నాగరాజు నుంచి రూ.50 వేలు ఇవ్వాలని నాగరాజును డిమాండ్ చేశారు. చిన్నపాటి గొడవకు ఇంత పెద్ద మొత్తంలో తాను ఇచ్చుకోలేనని ఎస్ఐతో లంచం డబ్బుల కోసం బేరమాడారు. చివరికి రూ.20 వేలకు ఎస్ఐ కృష్ణకుమార్ కు బాధితుడు నాగరాజుకు మధ్య పరస్పర ఒప్పందం కుదిరింది. ఎస్ఐ తనను లంచం డబ్బుల కోసం వేధించిన తీరుకు నాగరాజుకు చిర్రెత్తి ఎలాగైనా ఎస్ఐ ఏసీబీ అధికారులకు నిజామాబాద్ జిల్లా వర్ని ఎస్ఐ కృష్ణకుమార్ శుక్రవారం ఓ బాధితుడి వద్ద రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా చిక్కారుపట్టివ్వాలని పథకం వేశాడు. ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చి వారితో కలిసి పథక రచన చేశారు. తమ ప్లాన్ లో భాగంగా బాధితుడు నాగరాజు శుక్రవారం ఎస్ఐ కృష్ణకుమార్ కు రూ.20 వేలు లంచం డబ్బులు ఇచ్చాడు. వెంటనే ఏసీబీ డీఎస్పీ శేకర్ రెడ్డి తన సిబ్బందితో కలిసి బాధితుడి నుంచి లంచం డబ్బలు తీసుకుంటుండగా.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో రెవెన్యూ ఆఫీసర్ నరేందర్ ఇంట్లో ఏసీబీ రైడ్స్ తర్వాత వరుసగా జిల్లాలో ఏసీబీ దాడులు జరుగుతున్నాయి. టీజీఎన్ పీడీసీఎల్ లో పనిచేసే ఉద్యోగి లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. నందిపేట్ మండలంలో ఓ గ్రామకార్యదర్శి ఏసీబీ కి పట్టుబడ్డాడు. నిజామాబాద్ నగరంలోని కోటగల్లిలోని బాలికల హాస్టల్ లో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. తాజాగా పోలీస్ శాఖలో వణుకు పుట్టించేలా ఎస్ ఐ ని పట్టుకున్నారు. ఏసీబీ దాడులతో జిల్లా లో ఉద్యోగులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఏసీబీ పంజా ఎప్పుడు ఎవరి పైన పడుతుందోనని భయపడుతున్నారు.