వ‌రుస దొంగ‌త‌నాల‌కు పాల్ప‌డుతున్న దొంగ‌ల ముఠా అరెస్ట్‌..

by Kalyani |
వ‌రుస దొంగ‌త‌నాల‌కు పాల్ప‌డుతున్న దొంగ‌ల ముఠా అరెస్ట్‌..
X

దిశ‌, ఏటూరునాగారంః- గ‌త కొంత కాలంగా నూగూరు వెంకటాపురం ప‌రిధిలో వ‌రుస దొంగ‌త‌నాల‌కు పాల్ప‌డుతున్న దొంగ‌ల ముఠాను వెంక‌టాపురం పోలీసులు ప‌ట్టుకున్నారు. ఈ మేర‌కు శుక్ర‌వారం రోజున ప‌ట్టుబ‌డిన దొంగ‌ల ముఠా వివ‌రాల‌ను వెంకటాపురం సీఐ బండారి కూమార్ మీడియాకు వెల్ల‌డించారు..సీఐ క‌థ‌నం మేర‌కు..గురువారం రోజున నూగూరు వెంక‌టాపురం ప‌రిధిలో గ‌ల ఇండియాన్ అయిల్ పెట్రోల్ బంక్ స‌మీపంలో వాహ‌న త‌నిఖీలు నిర్వ‌హిస్తుండ‌గా.. నూగూరు వైపు నుండి వెంకటాపురం వైపు ముగ్గురు వ్య‌క్తులు హీరో హోండా ద్విచ‌క్ర వాహ‌నం పై వ‌స్తూ పోలీసుల‌ను చూసి పారిపోవడానికి ప్రయత్నించారు.అనుమానంతో వారిని పోలీసులు ప‌ట్టుకుని త‌నిఖీ చేయ‌గా వారి వ‌ద్ద బంగారం, వెండి అభ‌ర‌ణాలు, కొంత న‌గ‌దు ప‌ట్టుబ‌డింద‌ని తెలిపారు.వెంట‌నే వారిని విచారించ‌గా ప‌ట్టుబ‌డిన ముగ్గురు వ్య‌క్తులు గ‌త నెల రోజుల నుండి వెంక‌టాపురం మండ‌ల ప‌రిధిలో తాళం వేసి ఉన్న ఇళ్ల‌ను టార్గెట్ చేసి రాత్రి స‌మయాల‌లో వ‌రుస దొంగ‌త‌నాల‌కు పాల్ప‌డుతున్నట్లుగా ఒప్పుకున్నార‌ని, దొంగ‌త‌నాలు చేసిన‌పుడు దొరికిన అభ‌ర‌ణాల‌లో కొన్నింటిని తెలిసిన వ్య‌క్తికి అమ్మినామ‌ని, మిగిలిన ఆభ‌ర‌ణాలు వారి వ‌ద్ద ఉన్న‌ట్లుగా ఒప్పుకున్నారని వెంకటాపురం సీఐ తెలిపారు.

కాగా ప‌ట్టుబడే స‌మ‌యానికి కూడా వారు ఏదైన తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగ‌త‌నానికి వెలుతున్న‌ట్లుగా వారు ఒప్పకున్నార‌ని సీఐ వెల్ల‌డించారు. కాగా ప‌ట్టుబ‌డిన ముగ్గురు వ్య‌క్తులు 1)ఏటూరునాగారం మండ‌లం రామ‌న్న‌గూడెం గ్రామానికి చెందిన జూపాక ప్ర‌శాంత్‌(26), 2)అన‌కాప‌ల్లి జిల్లా న‌ర్సీప‌ట్నం మండ‌లం బ‌ల్లిగ‌ట్నం గ్రామానికి చెందిన క‌ల్తీ రాజు(34),3)ఏటూరునాగారం మండ‌లం లంబాడి తండా గ్రామానికి చెందిన గార ప్ర‌వీణ్ (24)గా గుర్తించామ‌ని,ప‌ట్టుబడిన వ్య‌క్తుల వద్ద నుండి బంగార‌పు చెవి క‌మ్మ‌లు-ఒక జ‌త‌, ఇంటి తాళం ప‌గుల‌గోట్టాడానికి ఉప‌యోగించే లీవ‌ర్‌,సామ్‌సంగ్ స్మార్ట్ ఫోన్‌, బంగార‌పు రింగ్స్-03, వెండి ప‌ట్టీలు-ఒక జ‌త‌, కీ ప్యాడ్ చ‌ర‌వాణీ, రీయ‌ల్ మీ స్మార్ట్ ఫోన్ ఒక‌టి, హీరో హోండా స్పెండ‌ర్ ప్ల‌స్ ద్విచ‌క్ర వాహ‌నం, న‌గ‌దు 5000 వేల రూపాయాలు స్వాధీన ప‌రుచుకున్న‌ట్లు సీఐ కూమార్‌ తెలిపారు.

ప‌ట్టుబ‌డిన ముగ్గురు నిందితుల‌లో జూపాక ప్ర‌శాంత్ అనే వ్య‌క్తి 2023 సంవ‌త్స‌రంలో వెంక‌టాపురం ఏరియాలో వ‌రుస దొంగ‌త‌నాల‌కు పాల్ప‌డి వెంక‌టాపురం పోలీసు చేత అరెస్ట్ అయి జైల్‌కి వెళ్ల‌డ‌ని జైల్ నుండి విడుదలైన త‌ర్వాత మంగ‌పేట ఏరియాల్ దొంగ‌త‌నాల‌కు పాల్ప‌డుతూ మంగ‌పేట పోలీసు చేత అరెస్ట్ అయి జైల్‌కు వెళ్లి గ‌త నెల రోజుల క్రితం విడుద‌లైయ్యాడ‌ని పోలిసులు తెలిపారు. జూపాక ప్ర‌శాంత్ జైల్ నుండి విడుద‌లైన త‌రువాత త‌న స్నేహితులైన కల్తీ రాజు,గార ప్ర‌వీణ్‌ల‌తో పాటు వెంక‌టాపురం ఏరియాల‌క్ష నెలారుపేట‌లో ఒక ఇంటిలో, ఆలుబాక గ్రామంలో రోడ్డు ప్ర‌క్క‌న ఉన్న ఇంట్లో దొంగ‌తానానికి పాల్ప‌డిన‌ట్లుగా సీఐ తెలిపారు.

పట్టుబ‌డిన ముగ్గురు వ్య‌క్తులు చెడు వ్య‌స‌నాల‌కు అల‌వాటై వాటిని నెర‌వేర్చుకోవాడానికి సుల‌భంగా డబ్బులు సంపాదించాల‌నే ఉద్దేశ్యంతో దొంగ‌తానాల‌కు పాల్ప‌డుతున్నట్లుగా త‌మ విచార‌ణ‌లో తెలింద‌ని, ప‌ట్టుబ‌డిన ముగ్గురిని రిమాండ్ నిమిత్తం కోర్టులో హ‌జ‌రుప‌ర‌చ‌టం జ‌రుగుతుంద‌ని వెంక‌టాపురం సీఐ తెలిపారు. ఈ సంద‌ర్బంగా వెంకటాపురం పోలీసులు మాట్ల‌డుతూ.. గ్రామస్తులు ఏదైనా శుభకార్యాలకు కానీ, పని మీద గానీ ఇంటిని లాక్ చేసి బయటకు వెళ్ళేటప్పుడు ఇంట్లో విలువైన వస్తువులను లేకుండా జాగ్రత్త పడల‌ని,లేదంటే పోలీస్‌ల‌కు ముందుగానే స‌మాచారం తెలియ‌ప‌ర‌చాల‌ని అంతే కాకుండా రాత్రి స‌మ‌యాల‌లో ఏవ‌రైన అనుమాన‌స్పదంగా తిరుగుతూ క‌నిపిస్తే వెంట‌నే వారి స‌మాచారం పోలీసుల‌కు తెలియజేయాల‌ని కోరారు.

Advertisement

Next Story