- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మునగ సాగు... రైతుల పాలిట వరం
దిశ, కొత్తగూడెం : మునగ సాగు... రైతుల పాలిట వరం అని కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. మునగసాగుపై అధికారులకు, రైతులకు ఐడీఓసీ కార్యాలయం సమావేశ మందిరంలో శుక్రవారం ఇల్లందు, టేకులపల్లి, ఆళ్లపల్లి, గుండాల లక్ష్మి దేవి పల్లి ఎంపీడీఓలు, ఏపీఓలు, ఎంఏఓలు, ఏఈ ఓ లు, టీఏలు, ఈసీలు, ఎఫ్ఏ లు, రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మునగ సాగు రైతులకు వరం అని అన్నారు. మనం మన పొలంలో పని చేసుకుంటూ ఉపాధి హామీ పథకం ద్వారా కూలి రూపంలో, మెటీరియల్ రూపంలో మనకే డబ్బులు వచ్చే అద్భుతమైన అవకాశం మునగ సాగు ద్వారా లభిస్తుందని తెలిపారు. ఒక ఎకరానికి 1000 మొక్కలు నాటితే ప్రతి మొక్కకు కనీసం 150 కాయలు కాసినా 1000 మొక్కలకు 1,50,000 కాయలు వస్తాయి.
ఈ కాయలను రూపాయికి రెండు చొప్పున అమ్మినా 75 వేల రూపాయలు ఆదాయం వస్తుందని, అంతే కాకుండా ఎండబెట్టిన ఆకుల పొడి ద్వారా, ఎండిన గింజల ద్వారా వచ్చే నూనె వలన అధిక ఆదాయం రైతులకు లభిస్తుందన్నారు. అధికారులు రైతులకు మునగ సాగుపై అవగాహన కల్పించాలని, ప్రతి వంద మంది రైతుల్లో కనీసం ఐదుగురు మునగ సాగు చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రతి రైతు కనీసం ఒక్క ఎకరంలో మునగ సాగు చేపట్టేలా అవగాహన కల్పించాలన్నారు. ఈ వారంలో మునగ సాగుకు రైతులు సన్నద్ధం కావాలని, లేకపోతే ఈ సీజన్ లో అవకాశం కోల్పోతామని అన్నారు.
ఈ సందర్భంగా రైతులు మునగసాగు చేయడంలో వచ్చే సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలని కోరారు. కలుపు తీసేందుకు యంత్రాలు అందించాలని, మునగ ఆకు పొడి చేసే పరికరాలు అందించాలని కోరారు. పోడు భూముల్లో మునగ సాగు చేపట్టే రైతులకు బోరు వేసుకునేలా అటవీశాఖ అధికారుల నుంచి అనుమతులు వచ్చేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ కు విన్నవించారు. దీనికి కలెక్టర్ ఆరుగాలం కష్టపడి సాగు చేసిన రైతుకు సరైన మార్కెటింగ్ అవకాశాలను కల్పిస్తామని, పోడు భూముల్లో సాగు చేసే రైతులకు బోరు అనుమతుల కోసం అటవీ శాఖ అధికారులతో మాట్లాడతామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాబురావు, జిల్లా ఉద్యాన శాఖ అధికారి కిషోర్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.