- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఇంటి ముందు కాకి అరుపు అశుభమా.. దీనిలో నిజమెంత?
దిశ, ఫీచర్స్ : కాకులకు మనిషి జీవితంలో జరిగే సంఘటనలను ముందుగానే అంచనా వేయగల సామర్థ్యం ఉందని చెబుతుంటారు. కాకులు మన పక్కన వాలితే ప్రమాదం పొంచి ఉందని, ఇంటి పైకప్పుపై కాకులు అరుస్తుంటే, కుటుంబానికి కష్ట కాలం వస్తుందని, కాకి మరణ వార్తలను తెస్తుందని.. ఇలా రక రకాలుగా చెబుతుంటారు. మరి దీనిలో నిజముందో ? లేదో ఇక్కడ తెలుసుకుందాం..
పురాణాలలో కాకులకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. కాకి శని దేవుని యొక్క వాహనంగా చెబుతుంటారు. ఈ కారణంగా దీనికి పూజలు చేస్తారు. రావణుడికి భయపడి కాకి రూపాన్ని ధరించిన యముడు కాకులకు గొప్ప వరాలిచ్చాడు. స్వయంగా కాకి రూపంలో వచ్చిన యముడు కాకులకు ఎలాంటి రోగాలు రావని వరం ఇచ్చాడు.
కాకి మీ ఇంటి దగ్గరికి వచ్చి అరుస్తుంటే .. శుభసూచకమని చెబుతున్నారు. విష్ణు పురాణం ప్రకారం, కాకి పూర్వీకుల చిహ్నంగా పరిగణించబడుతుంది. పితృ పక్షంలో కాకిని చూడటం ఒక ప్రత్యేక కార్యక్రమంగా పరిగణించబడుతుంది. పితృ పక్షంలో ఎంతో భక్తితో కాకులకు ఆహారం పెడతారు. కాకి పూర్వీకుల రాకకు ప్రతీక అని నమ్ముతారు.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.