సమ్మర్‌లో పాలు విరిగిపోతున్నాయా? ఈ బెస్ట్ టిప్స్ మీ కోసం!

by Anjali |
సమ్మర్‌లో పాలు విరిగిపోతున్నాయా? ఈ బెస్ట్ టిప్స్ మీ కోసం!
X

దిశ, ఫీచర్స్: ‘‘పాలు ఆరోగ్యానికి ఎంతో మంచివి. పాల ద్వారా మన శరీరానికి కాల్షియం, ప్రొటీన్లు, సహజ కొవ్వు, కేలరీలు, విటమిన్ డి, విటమిన్ బి-2, పొటాషియం అనేక పోషకాలు అందుతాయి. పాలను చల్లగా కాకుండా వేడిగా తీసుకుంటే దాని పోషక విలువలు గణనీయంగా పెరుగుతాయని, పిల్లలు పెద్దలు రోజూ వారీ ఆహారంలో చేర్చుకోమని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు.

పాలతో తయారయ్యే ఇతర ఉత్పత్తులైన పెరుగు, వెన్న, నెయ్యి, పనీర్ వంటివి హెల్త్ కు ఎంతో మేలు చేస్తాయి. ఆరోగ్యానికి హానికరమైన బ్యాక్టీరియా నశించాలంటే పాలను వేడి చేసుకుని తాగాలి. అయితే కొన్నిసార్లు పాలు వేడి చేసినప్పుడు పాలు విరిగిపోతాయి. ఇంకా వేసవికాలంలో ఇది ఎక్కువగా జరుగుతుంటుంది. కాగా పాలు విరగకుండా ఉండేందుకు పలు చిట్కాలు పాటిస్తే చాలు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

పాలు ఇంటికి తీసుకొచ్చిన వెంటనే స్టవ్ మీద పెట్టి వేడి చేయాలి. అనంతరం పాలను చల్లార్చి ఫ్రిజ్ లో పెట్టాలి. ఫ్రిజ్ లేనివారు 4 గంటలకొసారి వేడి చేస్తుండాలి. పాలు వేడి చేసి చల్లార్చాక గాజు సీసాలో లేదా గాజు పాత్రలో పోసి చల్లని ప్రదేశంలో పెట్టుకోవాలి. మిల్క్ ను కాచే ముందు పాలల్లో చికెడు బేకింగ్ సోడా వేయండి.

దీంతో పాలు విరగకుండా నిల్వ ఉంటాయి. అలాగే స్టీల్ పాత్రను కూడా యూజ్ చేయవచ్చు. ముందుగా ఆ స్టీల్ పాత్ర లో నీరు పోసి, వేడి చేశాక ఆ నీరుని తీసి అప్పుడు పాలు వేసుకోవాలి. పాలను ఫ్రిజ్ డోరులో పెట్టకుండా లోపలి అరల్లో పాలను ఉంచాలి. ఫ్రిజ్ ఉష్ణోగ్రత 32 డిగ్రీల ఫారన్‌హీట్‌ నుంచి 39.2 డిగ్రీల ఫారన్‌హీట్‌ మధ్యలో ఉండేలా చూసుకోవాలి.

Advertisement

Next Story

Most Viewed