స్నానం చేసిన వెంటనే నిద్రపోవడం ప్రమాదకరమా..?

by Kanadam.Hamsa lekha |
స్నానం చేసిన వెంటనే నిద్రపోవడం ప్రమాదకరమా..?
X

దిశ, ఫీచర్స్: రాత్రి వేళలో స్నానం చేయకుండా నిద్రపోని వాళ్లు చాలామంది ఉంటారు. కొందరు భోజనం చేసిన వెంటనే స్నానం చేసి నిద్రపోతుంటారు. అలాంటి వారు జాగ్రత్తగా ఉండకపోతే ఆరోగ్య సమస్యలు వస్తాయి. నిద్రపోయే ముందు స్నానం చేస్తే, మెదడుకు సంబంధించిన అనేక అనారోగ్య సమస్యలకు దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు. వాస్తవానికి రాత్రి వేళలలో శరీర ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి. దీనిని మెదడు గ్రహించి, బాడీకి రెస్ట్ ఇవ్వాలనే సంకేతాలు ఇస్తుంది. నిద్రపోవాలని మెదడు సంకేతాలు ఇస్తున్న సమయంలో స్నానం చేస్తే, బాడీలోని ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరుగుతాయి. దీని కారణంగా నిద్రకు ఆటంకం కలుగుతుంది. ఒకవేళ నిద్ర పోయినా.. దీని ప్రభావం మెదడుపై పడుతుంది.

కొందరు తలస్నానం చేసిన వెంటనే నిద్రపోతుంటారు. ఇది మరింత ప్రమాదకరం. స్నానం చేసిన వెంటనే నిద్రపోతే ఎలాంటి సమస్యలు వస్తాయో ఇక్కడ తెలుసుకోండి.

రక్తపోటు: రాత్రి వేళల్లో చాలామంది వేడి నీటితో స్నానం చేస్తుంటారు. ఇలా స్నానం చేసి వెంటనే నిద్రపోవడం వల్ల, గుండెపై ప్రభావం చూపుతుంది. శరీరంలో ఉష్ణోగ్రత పెరగడంతో గుండెపై ఒత్తిడి పెరుగుతుంది. ఇది రక్తపోటు సమస్యను మరింత పెంచుతుంది.

నిద్రకు భంగం: రాత్రిపూట స్నానం చేయడం వల్ల నిద్రకు భంగం కలుగుతుంది. చాలామంది అసటను తొలగిస్తుందని అనుకుంటారు. కానీ, స్నానం చేసిన వెంటనే నిద్రపోతే దీని ఎఫెక్ట్ శరీరంపై పడుతుంది. దీని కారణంగా పగలు అలసట పెరుగుతుంది. నిద్ర సరిగా పట్టకపోవడంతో ఒత్తిడి, డిప్రెషన్ వంటి సమస్యలు వస్తాయి.

కంటికి ఎఫెక్ట్: ప్రతీ రోజు వేడి నీటితో స్నానం చేయడం వల్ల కళ్లలో తేమశాతం తగ్గిపోతుంది. దీంతో కళ్లు ఎర్రగా మారుతాయి. ఇది అనేక కంటి సమస్యలకు కారణం కావొచ్చు.

అధిక బరువు: రాత్రి భోజనం తరువాత వెంటనే స్నానం చేయడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉంది. ఇది జీర్ణక్రియపై ప్రభావం చూపుతుంది. ఆహారం జీర్ణం కావడానికి కడుపులో రక్త ప్రసరణ జరగడం చాలా అవసరం. కానీ, స్నానం చేసిన వెంటనే ఇతర శరీర భాగాలకు రక్త ప్రసరణ వేగంగా జరుగుతుంది. ప్రతీసారి భోజనం తరువాత స్నానం చేసి నిద్రపోతున్నట్లైతే దీర్ఘకాలిక సమస్యలు వస్తాయి.

జుట్టు సమస్య: స్నానం చేసిన తరువాత చాలామంది తడి వెట్రుకలతోనే నిద్రపోతుంటారు. అలా నిద్రపోవడం వల్ల బ్యాక్టీరియా మరింత పెరుగుతుంది. దీని వల్ల స్కాల్ప్ దెబ్బతిని, జుట్టు రాలే సమస్య ఎక్కువ అవుతుంది. తలపై దురద, చుండ్రు వంటివి వస్తాయి.

*గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story