ముక్కులో నుంచి బ్లడ్ వస్తుందా!.. లైట్ తీసుకుంటే ప్రమాదంలో పడ్డట్టే..

by Kavitha |
ముక్కులో నుంచి బ్లడ్ వస్తుందా!.. లైట్ తీసుకుంటే ప్రమాదంలో పడ్డట్టే..
X

దిశ, ఫీచర్స్: వేసవిలో అధిక వేడి కారణంగా చాలా మందికి ముక్కు నుంచి బ్లడ్ కారడం గమనిస్తుంటాం. అదే విధంగా ముక్కులో అలర్జీ, ముక్కు రక్త నాళాలు దెబ్బతినడం, అధిక వేడి, మసాలాలు అధికంగా తీసుకోవడం, శరీరంలో పోషకాలు లేకపోవడం, ముక్కుకు గాయం, సైనస్ వంటి అనేక కారణాల వల్ల ముక్కు నుంచి బ్లడ్ రావడానికి కారణం కావచ్చు. కాగా మలేరియా, టైఫాయిడ్, అధిక తుమ్ములు, ముక్కును ఎక్కువగా రుద్దడం మొదలైనవి కూడా దీనికి కారణాలు అయ్యే అవకాశం ఉంది. అయితే కొన్ని ఇంటి చిట్కాలను పాటించడం వల్ల ఈ సమస్య నుంచి బయట పడవచ్చు. మరి అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

అలాగే ఈ క్రింది సమస్యలను ఎదుర్కొనే వారు వెంటనే వైద్య సలహా తీసుకోవాలి:

1.తరచుగా ముక్కు నుంచి రక్తస్రావం కావడం

2.తలకు గాయం అయితే ముక్కు నుంచి రక్తస్రావం జరిగినప్పుడు

3.బ్లడ్ థిన్నర్స్ మెడికేషన్ పై ఉన్న వారు ఈ సమస్యను నిర్లక్ష్యం చేయరాదు.

4.10-15 రక్తస్రావం నిమిషాల కంటే ఎక్కువ సమయం ముక్కు నుంచి రక్తం కారడం

5.ముక్కు నుంచి రక్తం వచ్చేటప్పుడు గుండె దడగా అనిపించడం

చిట్కాలు:

ముక్కు మూసుకోండి:

ముక్కు అకస్మాత్తుగా రక్తస్రావం ప్రారంభిస్తే, వెంటనే దాని పై మెల్లిగా ప్రెస్ చేస్తూ కొంచెం గట్టిగా పట్టుకోండి. ఇలా చేయడం వల్ల నాసికా సెప్టం మీద ఒత్తిడి పడి రక్తస్రావాన్ని ఆపే ప్రయత్నం చేస్తుంది. ఇలా చేస్తున్నప్పుడు నోటి ద్వారా శ్వాస తీసుకోండి. ఈ చిట్కాను సుమారు 1 నిమిషం పాటు పాటిస్తే , ముక్కు నుంచి రక్తస్రావం ఆగిపోతుంది.

ఐస్ క్యూబ్స్:

ముక్కు నుంచి రక్తం కారుతున్న సందర్భంలో, 2-3 నిమిషాలు స్లోగా ప్రెస్ చేస్తూ ముక్కుపై ఐస్ క్యూబ్స్ ప్యాక్ ఉంచండి. ఇలా చేయడం వల్ల ముక్కు లోపల కూల్ అయి, ముక్కు నుంచి రక్తస్రావం ఆగిపోతుంది. ఐస్ చల్లదనం రక్తం గడ్డకట్టడానికి, రక్తస్రావం ఆపడానికి చాలా బాగా యూస్ అవుతుంది.

ఉల్లిపాయ రసం:

ముక్కు నుంచి రక్తస్రావం అవుతున్నప్పుడు ఉల్లిపాయను మిక్సీలో మెత్తగా రుబ్బి దీని రసాన్ని బయటకు తీసి.. దూదిని అందులో ముంచి, 2-3 నిమిషాలు ముక్కుపై ఉంచండి. ఉల్లిపాయ వాసన వల్ల రక్తం గడ్డకట్టి రక్తస్రావాన్ని ఆపుతుంది.

పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహన కోసం మాత్రమే దీనిని అందిస్తున్నాం. నిర్ధారణలు, పర్యవసనాలకు సంబంధించి ‘దిశ’ ఎటువంటి బాధ్యత వహించదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించడం ఉత్తమం.

Advertisement

Next Story

Most Viewed