International Women's Day 2024 theme: అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2024 థీమ్!!

by Anjali |
International Womens Day 2024 theme: అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2024 థీమ్!!
X

దిశ, ఫీచర్స్: ‘‘స్త్రీ లేకపోతే జననం లేదు. గమనం లేదు. సృష్టిలో జీవం లేదు. అసలు సృష్టే లేదు. అలాంటి స్త్రీ కోసం ఓ స్పెషల్ డే ఉంది. అదే అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ప్రతి ఏటా మార్చి 8వ తారీకున దీనిని ఘనంగా జరుపుకుంటారు. మహిళా లోకం సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ విజయాలను గుర్తించడంపై దృష్టి సారించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం లింగ సమానత్వం, మహిళల హక్కుల కోసం గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉంది. అన్ని రంగాల్లో మహిళల హక్కుల గురించి అవగాహన పెంచుకోవడానికి ఈ మహిళా దినోత్సవం ఒక వేదికగా నిలుస్తుంది.

మహిళల సక్సెస్‌ను గుర్తించి గౌరవించడానికి ప్రపంచవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు, సభలు ఏర్పాటు చేసి.. ప్రసంగాలు ఇస్తారు. మహిళలకు బహుమతులు అందజేస్తారు. అయితే ప్రతి ఏటా అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు ఐక్యరాజ్య సమితి ఒక థీమ్ ఏర్పాటు చేస్తుంది. ఈ ఏడాది థీమ్‌గా ‘‘మహిళలు పెట్టుబడి పెట్టండి.. ప్రగతిని వేగవంతం చేయండి’ అనేది ఆర్థిక అసమర్థతను ఎదుర్కోవడమే లక్ష్యంగా నిర్ణయించింది.

Advertisement

Next Story

Most Viewed