- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Instagram: తప్పిపోయిన పిల్లల కోసం.. ఇన్‌స్టాలో ప్రత్యేక ఫీచర్
దిశ, ఫీచర్స్ : Instagram launches amber alert feature to help find missing children| ప్రస్తుత కాలంలో ఇన్‌స్టాగ్రామ్ యాప్‌కి యూజర్స్ నుంచి భారీ ఆదరణ లభిస్తోంది. ఈ ప్లాట్ ఫామ్‌లో కొంతమంది ప్రత్యేక టాలెంట్‌తో సెలబ్రెటీలుగా మారుతున్న సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు ప్రజలకు మరో రకమైన సేవలందించేందుకు సరికొత్త ఫీచర్‌ను ప్రవేశ పెడుతున్నట్లు తెలిపింది.
ఫేస్‌బుక్‌లో ఉండే అంబర్ అలెర్ట్ ఫీచర్ (తప్పిపోయిన పిల్లలను కనుగొనడం. ఆపదలో ఉన్నవాళ్లను రక్షించడం) ఎలాంటి సేవలందిస్తోందో తెలిసిన సంగతే. ఇప్పుడు అదే కోవలో ఇన్‌స్టాగ్రామ్ కూడా 'అంబర్ అలెర్ట్ ఫీచర్'ను ప్రారంభించినట్లు తెలిపింది. ఈ మేరకు జూన్ 2నుంచి యూఎస్‌లో అందుబాటులోకి వచ్చినట్లు ప్రకటిస్తూ.. పిల్లలకు సంబంధించిన ఫోటో, ఇతర వివరాలతోపాటు అపహరణ జరిగిన ప్రదేశం వంటి ముఖ్యమైన వివరాలు ఇందులో పొందపరచాలని చెప్పింది. అలాగే ఈ తాజా అప్‌డేట్‌తో చట్టాన్ని అమలు చేసేవారు అంబర్ హెచ్చరికను యాక్టివేట్ చేసి మీరు నిర్దేశించిన ప్రాంతంలో ఉంటే అలెర్ట్ అనేది మీ ఇన్‌స్టాగ్రామ్ ఫీడ్‌లో కనిపిస్తుందని స్పష్టం చేసింది. ఇకపోతే ఈ ఫీచర్ అనేది మరొకొద్ది వారాల్లో 25 దేశాల్లో అందుబాటులోకి రానుండగా.. ఇండియాలోకి ఎప్పుడొస్తుందనేది క్లారిటీ లేదు.