- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రిలేషన్‌షిప్‌లో హద్దులు సెట్ చేసుకోవాలంటున్న భారతీయులు.. సర్వేలో వెల్లడి
దిశ, ఫీచర్స్ : ఇండియన్ అడల్ట్స్ డేటింగ్ అండ్ రిలేషన్‌షిప్ విషయంలో మునుపెన్నుడూ లేనంత అలర్ట్‌గా ఉంటున్నారని, తమకు తాము సరిహద్దులు సెట్ చేసుకుంటున్నారని ఒక ఆన్‌లైన్ డేటింగ్ యాప్ ఇటీవల నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ఆన్‌లైన్ డేటింగ్ అంటే మిమ్మల్ని మీ సోల్‌మేట్‌కి దారితీసే అనేక ప్రొఫైల్‌ల ద్వారా బ్రౌజ్ చేయడం మాత్రమే కాదని, ఇక్కడ జాగ్రత్తలు అవసరమని వెల్లడించింది. ఇబ్బందికర పరిస్థితులను ముందుగానే నివారించడానికి ఎవరికివారే ప్రాధాన్యం ఇచ్చుకోవడం, సరిహద్దులు సెట్ చేసుకోవడం ముఖ్యమని 41 శాతంమంది భారతీయ పెద్దలు సూచిస్తున్నారని పేర్కొన్నది.
ఇండియన్ డేటింగ్ అండ్ మ్యాచ్ మేకింగ్ యాప్, QuackQuack రీసెంట్ సర్వే ఆన్‌లైన్ రిలేషన్ షిప్‌లో సరిహద్దులవల్ల కలిగే ప్రయోజనాలను ఎనలైజ్ చేసింది. టైర్ 1 అండ్ 2 నగరాలలోని 18 నుంచి 35 ఏళ్లలోపు వయస్సు కలిగిన 10,000 మంది అడల్ట్స్‌ను సర్వేలో భాగంగా ప్రశ్నించినట్లు ఆ యాప్ ఫౌండర్, సీఈవో రవి మిట్టల్ వెల్లడించారు. ‘‘ మేము మొదటి ఛాటింగ్ దశలో ఇష్టాయిష్టాల గురించి డిస్కషన్ చేసే మ్యాచ్‌లను చూశాం. కానీ రీసెంట్‌గా సరిహద్దులు అవసరమని భావిస్తున్న భారతీయ పెద్దలను చూశాం’’ అని పేర్కొన్నాడు.
మ్యాచ్ కుదిరిన వెంటనే అలా చేయండి
21 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సుగల 32% మంది భారతీయ పెద్దలు డేటింగ్ యాప్‌లో మ్యాచ్ కుదిరిన వెంటనే సరిహద్దులను సెట్ చేయడం చాలా అవసరమని అభిప్రాయడ్డారు. కొత్త వ్యక్తులతో డేటింగ్ చేసేటప్పుడు భద్రతాపరమైన చర్యలను దృష్టిలో పెట్టుకోవాలని వెల్లడించారు. ఎందుకంటే కోరుకున్న విధంగా సంబంధాలు సెట్ కాకపోతే మానసికంగా ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఈ సరిహద్దులు బాగా పనిచేస్తాయని చెప్తున్నారు. అలాగే ఇంకా రిలేషన్ షిప్‌లోకి వెళ్లనివారు, సరైన సంబంధం కోసం ఇతరులతో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు మరీ లోతుల్లోకి వెళ్లకుండా అవసరం మేరకు వ్యవహరించాలని అభిప్రాయపడుతున్నారు. అందుకోసం ఎదుటి వ్యక్తితో మాట్లాడే సమయం సెట్ చేసుకోవాలని సూచిస్తున్నారు. అలాగే ఆఫీసు పనివేళ్లల్లో అనుకూలం కాని సమయంలో ఛాటింగ్, కాలింగ్ వంటి విషయాలకు ప్రాధాన్య ఇవ్వొద్దని చెప్తున్నారు.
ప్రైవేట్ సమాచారం ఇవ్వొద్దు
25 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సుగల 37% మంది భారతయీ మహిళలు తమ ప్రయివేట్ ఇన్ఫర్మేషన్‌ను సరిహద్దుల్లో ఉంచుకోవాలని యువతీ యువకులకు సలహా ఇస్తున్నారు. ఎందుకంటే పర్సనల్ విషయాల్లో కూడా ప్రజలు జోక్యం చేసుకునే అవకాశం ఉంటుందని, జడ్జిమెంట్ చేస్తారని అంటున్నారు. అందుకే తమ ఇంటి చిరునామాను, సున్నితమైన సమాచారాన్ని షేర్ చేసుకోవద్దని చెప్తున్నారు. ఇక మెట్రో సిటీలు, స్మాల్ సిటీల నుంచి సర్వే చేయబడిన మహిళలు డేటింగ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేయడానికి ముందే ఈ సరిహద్దును సెట్ చేయడం మంచిదని పేర్కొన్నారు. మీ మ్యాచ్ ఎంత అద్భుతంగా అనిపించినా గోప్యతను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
తిరస్కరించినా పర్వాలేదు
ఆన్‌లైన్‌లో డేటింగ్ చేసేటప్పుడు సెట్ చేయవలసిన రెండు అత్యంత కీలకమైన సరిహద్దులను ఇండియన్ అడల్ట్స్ సూచిస్తున్నారు. అవేంటంటే.. ప్రైవేట్ ఫోటోలు షేర్ చేయవద్దని, వ్యక్తిగత ఆర్థికపరమైన రహస్యాలను వెల్లడించవవద్దని 42% మంది పెద్దలు వెల్లడించారు. అలాగే 22 శాతం మంది మహిళలు ఇలాంటి విషయాల గురించి మాట్లాడటం సరైందని అనిపించినా, ఎదుటి వ్యక్తికి మీ ఫోటోను షేర్ చేసుకునేంత విశ్వసనీయత కలిగినా అలా చేయకూడదని స్పష్టం చేశారు. ఇలా చేయడంవల్ల ఎదుటి వ్యక్తి మీ సంబంధాన్ని తిరస్కరించినా పర్లేదు కానీ హద్దులు మాత్రం దాటవద్దని చెప్తున్నారు.
టైమ్ లిమిట్
25 ఏళ్లు పైబడిన పురుషులలో 17% మంది ఆన్‌లైన్ డేట్‌తో చాట్ చేస్తున్నప్పుడు టైమ్‌లైన్ సెట్ చేసుకుంటున్నామని తెలిపారు. తమ సంబంధం సరిపోలిన వెంటనే మొదటి సారి కలుసుకోవడానికి ఎంత ఎంతసేపు వేచి ఉండేది? రిప్లయ్ కోసం ఎంతసేపు వేచి ఉండేది కూడా కచ్చితంగా ముందే చెప్పేయాలని భావిస్తున్నారు. ఇక 30 ఏళ్లు పైబడిన మహిళల్లో 39% మంది మహిళలు ఒకటికంటే ఎక్కువసార్లు నిరాసక్తత వ్యక్తం చేసినా కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తున్నవారితో కమ్యూనికేషన్ నిలిపివేయాలని పేర్కొన్నారు.