BIG SHOCK: సామాన్యులకు భారీ షాక్.. సెంచరీ మార్క్ దాటేసిన కూరగాయల ధరలు

by Anjali |
BIG SHOCK: సామాన్యులకు భారీ షాక్.. సెంచరీ మార్క్ దాటేసిన కూరగాయల ధరలు
X

దిశ, ఫీచర్స్: సామాన్యులకు నిత్యావసర ధరలు గుండెల్లో దడ పుట్టిస్తున్నాయి. పప్పులు, ఉప్పు నుంచి మటన్, చికెన్ రేట్లు రోజు రోజూకు కొండెక్కి కుర్చుంటున్నాయి. ఇక కూరగాయల ధరల గురించైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఒకప్పుడు మార్కెట్‌కు వంద రూపాయలు తీసుకెళ్తే చాలు తీసుకెళ్లిన సంచి మొత్తం నిండేది. కానీ ఇప్పుడు ఆ 100 రూపాయలకు రెండు ఐటెమ్స్ కూడా రావడం లేదు. ప్రతి కూరగాయకు యాభై, ఆరవై పైనే అమ్ముతున్నారు. ప్రస్తుతం కూరగాయల రేట్లు మరింత పెరిగి సామాన్యులకు షాక్‌ల మీద షాక్ లు ఇస్తున్నాయి. ఇకపోతే హైదరాబాదులో కూరగాయలు ధరలు చూసినట్లైతే.. కేజీ చిక్కుడుకాయ ధర 120 రూపాయలు పలుకుతోంది.

టమాటా రూ. 100 ఉంది. కేజీ పచ్చిమిర్చి- 100, కాకరకాయ 90 రూపాయలు, క్యారెట్- 100 రూపాయలు, క్యాలీఫ్లవర్- 80 రూపాయలు పలుకుతోంది. దీంతో సామాన్యులు కూరగాయలు కొనడానికి వెనకడుగు వేస్తున్నారు. మార్కెట్‌కు వెళ్లాలంటే ఆలోచించే పరిస్థితి నెలకొంది. గత రెండేళ్లుగా వాతావరణం అనుకూలించకపోవడం కారణంగా పంట నష్టాలు జరిగాయని, పంట నష్టాలే వ్యవసాయ ఉత్పత్తిని ప్రభావితం చేశాయని బడ్జెట్ సమావేశంలో కేంద్రం వెల్లడించిన విషయం తెలిసిందే. కాగా కట్టడికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. నిత్యావసర ధరలు ఎప్పుడు తగ్గుముఖం పడుతాయో.. సామాన్య ప్రజలు ఎప్పుడు ఊపిరిపీల్చుకుంటారో చూడాలి మరీ.



Next Story