- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కదిలే వాహనంపై ప్రయాణం ప్రమాదకరం.. మరి పుష్అప్‌లు ఓకేనా.. చూడండి!
దిశ, వెబ్‌డెస్క్ః ఓవర్ యాక్షన్ హద్దులు దాటితే, ఒళ్లంతా షేపులు మారతాయని ఎన్నో సంఘటనలు నిరూపించాయి. అయినా, మనుషుల్లో, ముఖ్యంగా యువతలో మార్పు మాత్రం కనిపించదెందుకో..?! ఇలాంటి వారి కోసం మరోసారి, మరో ఉదాహరణ ఇక్కడుంది. స్పీడ్‌గా వెళ్తున్న చెత్త ట్రక్కుపై పుష్‌అప్‌లు చేస్తున్న ఓ యువకుడి షాకింగ్ వీడియో ఇంటర్నెట్‌లో హల్‌చల్ కావడమే కాదు, ఆగ్రహానికి గురిచేస్తోంది. లక్నోలోని గోమతీనగర్‌లో తీసిన ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. పోలీస్ అధికారి శ్వేతా శ్రీవాస్తవ ట్విట్టర్‌లో షేర్ చేసిన ఈ క్లిప్, వేగంగా వెళ్తున్న ట్రక్కుపై పుష్‌అప్‌లు చేయడానికి ఓ వ్యక్తి ఎలా ప్రయత్నిస్తున్నాడో చూపిస్తుంది.
అయితే, క్లిప్‌లో కొన్ని సెకన్ల తర్వాత, అతను పడిపోతాడు. ఒళ్లు గగ్గుర్లుపొడిచే ఈ వీడియోలో కట్‌చేస్తే, ఒళ్లంగా గాయాలతో ఆ యువకుడు దీనిస్థితిలో ఉంటాడు. ఎంతగా అంటే కొన్ని రోజులు అతను సక్రమంగా కూర్చేలేడు కూడా. అంతటి పెద్ద ప్రమాదం నుండి ప్రాణాలతో బయటపడ్డాడు. "గత రాత్రి లక్నోలోని గోమతీనగర్‌లోని దృశ్యం ఇది. అతడు శక్తిమాన్‌లా ఉండటానికి ప్రయత్నించాడు. అయితే, ఇప్పుడు కొన్ని రోజులు కనీసం కూర్చోలేడు! హెచ్చరిక: దయచేసి ఇలాంటి ఘోరమైన విన్యాసాలు చేయకండి!" అనే శీర్షికతో దీన్ని పోస్ట్ చేశారు. ఇలాంటి నిర్లక్ష్యపు ప్రవర్తన చూసి ప్రజలు దిగ్భ్రాంతి చెందడం మాత్రమే కాదు, ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజనులు డిమాండ్ చేశారు.
गोमतीनगर, लखनऊ का कल रात का दृश्य-
— Shweta Srivastava (@CopShweta) July 17, 2022
बन रहे थे शक्तिमान, कुछ दिनों तक नहीं हो पाएंगे विराजमान!
चेतावनी: कृपया ऐसे जानलेवा स्टन्ट न करें! pic.twitter.com/vuc2961ClQ