LLB పూర్తి చేసిన మెగాస్టార్.. నల్లకోటులో మెరిసిపోయే.. అభిమానుల కోసం ఫుల్ డిటైల్స్..

by Sujitha Rachapalli |
LLB పూర్తి చేసిన మెగాస్టార్.. నల్లకోటులో మెరిసిపోయే.. అభిమానుల కోసం ఫుల్ డిటైల్స్..
X

దిశ, ఫీచర్స్ : మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి ప్రస్తుతం నెట్టింట ట్రెండింగ్ లో ఉన్నాడు. ఆయన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇందుకు కారణం కాగా ఈ లెజెండ్ ఎక్కడ, ఏం చదివాడో పూర్తి వివరాలు తెలుసుకుందాం. 1951 సెప్టెంబర్ 7న కేరళలోని చండిరూర్ లో జన్మించిన ఆయన.. కొట్టాయంలో ఒక సాధారణ మధ్యతరగతి ముస్లిం కుటుంబంలో పెరిగాడు. కులశేఖర మంగళం ప్రభుత్వ పాఠశాలలో ప్రాథమిక విద్య పూర్తి చేసిన మమ్ముట్టి... తండ్రి అక్కడి నుంచి ఎర్నాకులంకు కుటుంబంతో సహా వెళ్లడంతో అక్కడి గవర్నమెంట్ స్కూల్ లో ఉన్నత విద్య పూర్తి చేశాడు. ఆ తర్వాత ప్రీ యూనివర్సిటీ కోర్సు.. అంటే ప్రీడిగ్రీ తేవారాలోని సేక్రేడ్ హార్ట్ కాలేజీలో చదివాడు. డిగ్రీ ఎర్నాకులంలోని మహారాజా కాలేజీలో పూర్తి చేశాడు. ఆయన ఇక్కడ LLB చేయడం విశేషం కాగా.. అనంతరం రెండేళ్లు మంజేరిలో న్యాయవాద వృత్తిని కొనసాగించారు. ఈ క్రమంలోనే అనుకోకుండా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు మమ్ముట్టి.

Advertisement

Next Story

Most Viewed