పీరియడ్స్ కాస్త ముందుగా రావాలనుకుంటున్నారా.. అయితే ఈ టిప్స్‌ని ఫాలో అవ్వండి!

by Kavitha |
పీరియడ్స్ కాస్త ముందుగా రావాలనుకుంటున్నారా.. అయితే ఈ టిప్స్‌ని ఫాలో అవ్వండి!
X

దిశ, ఫీచర్స్: ప్రతినెలా పీరియడ్స్ వల్ల ఆడవారు ఎన్ని ఇబ్బందులు పడతారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కొందరికి టైమ్ టు టైమ్ పీరియడ్స్ వస్తే మరికొందరికి మాత్రం ఒత్తిడి, హార్మోన్ల అసమతుల్యత, థైరాయిడ్ తదితర కారణాల వల్ల పీరియడ్స్ ఆలస్యమవుతూ ఉంటాయి. అయితే ఇంట్లో ఏమైనా ఫంక్షన్స్‌ లేదా ఫెస్టివల్స్ ఉన్నప్పుడు ఆడవారు పీరియడ్స్ కాస్త ముందుగా రావాలని కోరుకుంటూ ఉంటారు. పీరియడ్స్ ను ప్రీ పోన్ చేయడానికి మందులు ఉన్నప్పటికీ వాటిని వేసుకోవడం చాలా ప్రమాదకరం. కానీ ఈ ఇంటి చిట్కాలు పాటిస్తే సహజంగానే పీరియడ్స్ ను ప్రీపోన్ చేయవచ్చు. పైగా ఈ టిప్స్ వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మరి ఇంకెందుకు ఆలస్యం పీరియడ్స్ ముందుగా రావాలంటే ఎలాంటి టిప్స్ ఉపయోగపడతాయో తెలుసుకుందాం రండి..

పసుపు:

మీరు పీరియడ్స్ తేదీ కంటే పది రోజుల ముందు నుంచి నిత్యం నైట్ పసుపు పాలు తీసుకోవడం వల్ల త్వరగా పీరియడ్స్ వస్తాయి.

విటమిన్ సి:

విటమిన్ సి శరీరంలో ఈస్ట్రోజన్ స్థాయిలను పెంచి పీరియడ్స్ త్వరగా రావడానికి సహాయపడతాయి. కాబట్టి నెలసరి ముందుగా రావాలంటే సిట్రస్ పండ్లు, కివి, టమోటా, బ్రోకలీ మరియు బెల్ పెప్పర్స్ వంటి విటమిన్ సి ఫుడ్స్ ను డైట్‌లో చేర్చుకోండి.

దానిమ్మ:

నెలసరి తేదీకి పది రోజుల ముందు నుంచి దానిమ్మను తీసుకోవడం వల్ల పీరియడ్స్‌ను ప్రోత్సహించి తొందరగా వచ్చేలా చేస్తాయి.

అదేవిధంగా రుతుక్రమాన్ని ప్రేరేపించడంలో నువ్వులు, ఖర్జూరం, బొప్పాయి వంటి ఆహారాలు కూడా తోడ్పతాయి. ఇవి తీసుకోవడం వల్ల శరీరంలో వేడి ఏర్పడుతుంది. ఇది గర్భాశయ సంకోచాలకు కారణమవుతుంది. దాంతో మీ పీరియడ్స్ కాస్త ముందుగానే వస్తాయి. ఇక నెలసరి తేదీకి పది రోజుల ముందు నుంచి అల్లం టీ లేదా ధనియాల టీ తీసుకున్నా కూడా పీరియడ్స్ త్వరగా వస్తాయి.

పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహన కోసం మాత్రమే దీనిని అందిస్తున్నాం. నిర్ధారణలు, పర్యవసనాలకు సంబంధించి ‘దిశ’ ఎటువంటి బాధ్యత వహించదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించడం ఉత్తమం.

Advertisement

Next Story

Most Viewed