గాఢనిద్రలోకి జారుకోవాలంటే.. పడుకునే ముందు ఈ టీ ఒక్క కప్పు తీసుకుంటే చాలు..

by Aamani |   ( Updated:2023-06-08 15:14:18.0  )
గాఢనిద్రలోకి జారుకోవాలంటే.. పడుకునే ముందు ఈ టీ ఒక్క కప్పు తీసుకుంటే చాలు..
X

దిశ, ఫీచర్స్: సాధారణంగా చాలా మందికి రాత్రుళ్లు సరిగ్గా నిద్ర పట్టదు. ఎంత ప్రయత్నించినా సరే కంటికి కునుకు కరువవుతుంటుంది. లైఫ్‌లో ప్రాబ్లమ్స్, మనసులో తెలియని బాధ ఇందుకు కారణం అవుతుంటే.. ఇలా నిద్రపోయామో లేదో ఉదయం లేవగానే ఎన్నో తలనొప్పులు, చిరాకులు, ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే కొంతమంది నిద్ర కోసం స్లీపింగ్ ట్యాబ్లెట్స్ అలవాటు చేసుకుంటారు. కానీ వీటి వల్ల మెదడుపై ప్రభావం పడుతుందని.. బోలెడు సైడ్ ఎఫెక్ట్స్ దరిచేరుతాయని హెచ్చరిస్తున్నారు నిపుణులు. అందుకే ఇప్పుడు చెప్పబోయే మ్యాజిక్ టీని రోజు నైట్ పడుకునే ముందు ఒక కప్పు తీసుకుంటే ప్రశాంతమైన నిద్ర మీ సొంతం అవుతుంది. ఎలాంటి ఆలోచన లేకుండా గురక పెట్టి మరీ నిద్రపోతారు. మరి ఇంతకీ ఏంటా టీ? ఎలా తయారు చేస్తారు? చూద్దాం..

ముందుగా స్టవ్ వెలిగించి టీ గిన్నె పెట్టుకోవాలి. అందులో కప్పుకు సరిపడా నీళ్లు పోసి అందులో చిన్న సైజు దాల్చిన చెక్క, మూడు నుంచి నాలుగు పచ్చి పసుపు కొమ్ము ముక్కలు వేసుకుని.. అలాగే చిన్న అల్లం ముక్క, నాలుగు మిరియాలు వేసి ఐదు నిమిషాల పాటు బాగా మరిగించాలి. తర్వాత దాన్ని వడకట్టి కప్పులోకి తీసుకోవాలి. గోరు వెచ్చగా ఉన్నప్పుడే ఈ టీని పడుకోవడానికి అరగంట ముందు తాగితే ప్రశాంతమైన, సుఖమైన నిద్ర పొందవచ్చు. అలాగే ఈ టీని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు కరుగుతుంది. నాజూగ్గా మారుతుంది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్‌లు కూడా ఉండవు.

ఇవి కూడా చదవండి:

తరుచు యూరిన్ వెళ్తున్నారా? అయితే డేంజరే..!

Advertisement

Next Story