Diabetes risk with oversleeping: నిద్ర ఎక్కువైనా రిస్కే.. ఏం జరుగుతుందంటే..

by Javid Pasha |
Diabetes risk with oversleeping: నిద్ర ఎక్కువైనా రిస్కే.. ఏం జరుగుతుందంటే..
X

దిశ, ఫీచర్స్ : నిద్ర ఆరోగ్యానికి మంచిదనే విషయం మనకు తెలిసిందే. ఉరుకులు పరుగుల జీవనశైలి, అధిక ఒత్తిడుల నేపథ్యంలో సరైన శారీరక జీవక్రియల నిర్వహణలో క్వాలిటీ స్లీప్ కీ రోల్ పోషిస్తుంది. మధుమేహం బాధితులు రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవాలంటే కనీసం 7 నుంచి 8 గంటలు నిద్రపోవడం మంచిదని చెప్తుంటారు. కానీ అమెరికన్ ‘యూ షేపుడ్ అసోసియేషన్(U-shaped association) ఒక కొత్త అధ్యయనం అందుకు భిన్నమైన ఫలితాలను కనుగొన్నది.

ప్రతిరోజూ నిద్ర వ్యవధి 31 నుంచి 45 నిమిషాలపాటు పెరగడం వల్ల, అలాగే ఫిజికల్ యాక్టివిటీస్ లేనివారిలో అంతకంటే ఎక్కువ గంటలు నిద్రపోవడంవల్ల కూడా డయాబెటిస్ రిస్క్ 14 శాతం పెరుగుతుందని పరిశోధకులు గుర్తించారు. ఇక మధుమేహ బాధితుల్లో రోజుకు 7 గంటలపాటు నిద్రపోయేవారితో పోలిస్తే, 6 గంటలు లేదా అంతకంటే తక్కువ నిద్రపోవడం దీర్ఘకాలం కొనసాగించిన వారిలో కూడా డయాబెటిస్ రిస్క్ 9 శాతం పెరుగుతున్నట్లు రీసెర్చర్స్ కనుగొన్నారు. అంటే అతినిద్ర గానీ, మరీ తక్కువ నిద్రపోవడం గానీ దీర్ఘకాలం కొనసాగితే డయాబెటిస్ రిస్క్ పెరుగుతుందనే విషయం అర్థం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

* గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. దీనిని ‘దిశ’ ధృవీకరించడం లేదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story

Most Viewed