పచ్చి మామిడికాయలు తినడం వల్ల ఎన్ని ప్రయోజనాలో తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు!

by Hamsa |
పచ్చి మామిడికాయలు తినడం వల్ల ఎన్ని ప్రయోజనాలో తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు!
X

దిశ, ఫీచర్స్: ఎండ వేడి ఈ సారి మార్చి నెలలోనే మొదలైపోయింది. రోజు రోజుకు ఎండలు పెరిగిపోతున్నాయి తప్ప తగ్గడం లేదు. పూర్తిగా ఎండాకాలం రాకముందే భానుడి భగభగలకు జనాలను భయపెడుతున్నాయి. ఉదయం 9 గంటలకే ఎండ వేడి బాగా ఎక్కువగా ఉండటంతో.. మధ్యాహ్నం ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే ప్రజలు జంకుతున్నారు. మార్చి చివరలోనే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు వరకు ఉండటంతో భగ్గుమంటున్న భానుడు ఉగ్రరూపానికి అల్లాడిపోతున్నారు.

ఇక ఏప్రిల్, మే నెలలో ఇంకా ఎండల తీవ్రత ఎంతగా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు. దీంతో ఈ ఎండను తట్టుకునేందుకు అప్పుడే సమ్మర్‌ డైట్ మొదలెట్టారు. కొందరు వేసవిలో అందుబాటులో ఉండే పండ్ల రసాన్ని తాగుతూ.. శరీరాన్ని వేడి నుంచి కాపాడుకుంటున్నారు. అయితే ఎండాకాలంలో చిన్నా పెద్ద ఎంతగానో ఇష్టపడే మామిడికాయలు కూడా ఈ సీజన్‌లోనే అందుబాటులో ఉంటాయి. కానీ ఇవి శరీరానికి వేడి చేస్తాయని చెప్పి చాలా మంది తినడానికి సంకోచిస్తారు. దీంతో మామిడికాయలకు, జ్యూస్‌కు దూరంగా ఉంటారు. కానీ పచ్చి మామిడికాయలను తినడం వల్ల ఆరోగ్యానికి పలు ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు సూచిస్తున్నారు.

*పచ్చి మామిడిలో విటమిన్ సి, ఎ, కె, బి 6, కాల్షియం, ఫైబర్, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు వంటివి ఉండి శరీరానికి పోషకాలను అందించి మంచి లాభాలను కలిగిస్తాయి.

* అయితే ఇందులో ఉండే సి విటమిన్ వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో ప్రమాదకరమైన వ్యాధులు రాకుండా మనల్ని మనం రక్షించుకోవచ్చు.

* చిగుళ్ల ఇన్‌ఫెక్షన్స్, రక్తం కారడం, పన్ను నొప్పి వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందాలంటే కచ్చితంగా పచ్చి మామిడికాయ తినాలి. అలా చేస్తే బ్యాక్టీరియా, క్రీములు నశించడంతో పాటు పళ్లపై ఉన్న ఎనామెల్ దృఢంగా ఉంటుంది.

* ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల మధుమేహం వ్యాధి తగ్గడంతో పాటుగా రక్తంలోని చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.

* పచ్చి మామిడిలో పాలి ఫెనాల్స్ ఉంటాయి. కాబట్టి దీనిని తీసుకోవడం వల్ల ప్రమాదకరమైన క్యాన్సర్‌తో పోరాడుతుంది. అలాగే పెద్ద ప్రేగు, ఊపిరితిత్తులు, రొమ్ము క్యాన్సర్ వంటి క్యాన్సర్ కణాలు ఏర్పడకుండా చేస్తుంది.

* ముఖ్యంగా ఎండాకాలం డీహైడ్రేషన్ సమస్యతో బాధపడేవారు పచ్చి మామిడికాయలు తినడం వల్ల శరీరం హ్రైడేట్‌గా ఉంటుంది. ఇందులోని నీటి శాతం వడదెబ్బ తగలకుండా కాపాడుతుంది. అలాగే జీర్ణక్రియ పనితీరును మెరుగుపరుస్తుంది.

* ఇటీవల చాలా మంది ఒకే చోట ఎక్కువ సమయం పాటు కూర్చుని పని చేయడం వల్ల అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. దీంతో ఎన్ని డైట్స్ ఫాలో అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అలాంటి వారు పచ్చి మామిడి తినడం వల్ల బరువు తగ్గే అవకాశం ఉంది.

* గత కొద్ది కాలంగా చిన్నా,పెద్దా అని తేడా లేకుండా ఎంతో మంది హార్ట్ ఎటాక్‌తో ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఎన్నో చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అయితే పచ్చి మామిడి తినడం వల్ల ఇందులోని పొటాషియం, మెగ్నీషియం గుండెను ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. అంతేకాకుండా రక్తనాళాల పనితీరును మెరుగుపరచడంలో సహాయపడతాయి.

Advertisement

Next Story

Most Viewed