Bitter gourd juice: కాకరకాయ జ్యూస్ రోజూ తాగడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే షాకే..!

by Kavitha |
Bitter gourd juice: కాకరకాయ జ్యూస్ రోజూ తాగడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే షాకే..!
X

దిశ, ఫీచర్స్: సాధారణంగా మనలో చాలా మందికి కాకరకాయ అంటే ఇష్టం ఉండదు. ఎందుకంటే చేదుగా ఉంటాయి కాబట్టి తినడానికి అంత సుముఖత చూపించరు. కొంతమంది కూర చేసి పెట్టిన ముక్కలను పడేస్తూ ఉంటారు. కానీ తినగ తినగ వేము తియ్యగుండు అన్నట్టు కాకరకాయ రుచి మరిగితే దాని టేస్ట్‌ కింద చికెన్, మటన్ కూడా పనికి రావు. అయితే కూర చేసుకుంటే అందులో ఉండే కొన్ని పోషకాలు నశించి మన బాడీకి తగినంత ప్రయోజనాలు చేకూరదు. కానీ రోజు ఇలా కాకరకాయ జ్యూస్ చేసుకుని తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. అవేంటో మనం ఇప్పుడు చూద్దాం..

*కాకరకాయ జ్యూస్‌ను రోజూ ఉదయాన్నే పరగడుపున తాగడం వల్ల రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు కంట్రోల్ అవుతాయి.

* రోజూ ఉదయాన్నే పరగడుపున ఈ జ్యూస్ తాగితే అధిక బరువు తగ్గుతారు. శరీరంలో అధికంగా ఉన్న కొవ్వు కరిగిపోతుంది. జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. జీర్ణాశయం, పేగులు శుభ్రమవుతాయి.

*అలాగే కాకరకాయలో విటమిన్ ఎ, సి కూడా పుష్కలంగా ఉండటం వలన ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి జలుబు, ఫ్లూ వంటి అంటువ్యాధులకు వ్యతిరేకంగా పోరాడటానికి దృష్టిని మెరుగుపరచడానికి, కంటి సమస్యలను నివారించడానికి సహాయపడుతుంది.

*కాకరకాయ జ్యూస్‌‌ని తాగడం వల్ల శరీరంలోని విష, వ్యర్థాలను బయటకు పంపి శరీరాన్ని శుభ్రం చేస్తాయి. దీంతో చర్మం కాంతివంతంగా, మృదువుగా మారుతుంది.

*కాకరకాయ జ్యూస్‌ను రోజూ తాగితే రోగ నిరోధక శక్తి పెరిగి ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. రోజూ ఒక గ్లాస్ కాకరకాయ జ్యూస్‌ తాగటం వల్ల అధిక రక్తపోటు, హైబీపీ, అలర్జీలను దూరం చేస్తుంది. లేదంటే, రోజూ రెండు స్పూన్ల కాకర రసంతో కాసింత నిమ్మరసం చేర్చి మూడు నుంచి ఆరు నెలల పాటు తీసుకుంటే రక్త సంబంధిత రోగాలకు చెక్ పెట్టవచ్చునని నిపుణులు చెబుతున్నారు.

*కాకర కాయ జ్యూస్‌ తాగడం వల్ల కలరా వంటి వ్యాధులను కూడా దూరం చేస్తుంది. వాంతులు, విరేచనాలు వంటి సమస్యలకు చెక్‌ పెడుతుంది.

*అంతే కాకుండా పండిన కాకర జ్యూస్‌ తాగితే రక్తం, మూత్రంలో కలిసిన చక్కెర శాతాన్ని తగ్గిస్తుంది.

*కాకరకాయ జ్యూస్ తలకు రాసుకోవడం వల్ల జుట్టు రాలడం తగ్గి.. కొత్త హెయిర్ రావడానికి స్ట్రాంగ్‌గా అవుతాయి.

*కాకరకాయలోని యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షించడంలో సహాయపడతాయి. ఇది మొటిమలు, ముడతలను నివారించడంలో కూడా సహాయపడుతుంది.

*కాబట్టి రోజూ కాకరకాయ జ్యూస్ తాగండి ఆరోగ్యంగా ఉండండి. ఇన్‌కేస్ చేదుగా అనిపిస్తే స్టారింగ్‌లో కొన్ని రోజుల వరకు బెల్లం లేదా షుగర్‌ను కలుపుకొని తాగేయండి.

నోట్: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహన కోసం మాత్రమే దీనిని అందిస్తున్నాం. నిర్ధారణలు, పర్యవసనాలకు సంబంధించి ‘దిశ’ ఎటువంటి బాధ్యత వహించదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించడం ఉత్తమం.



Next Story