వీటిని పాటిస్తే చర్మ సమస్యలు ఎప్పటికీ మీ దరిచేరవు

by Prasanna |   ( Updated:2024-03-18 07:50:05.0  )
వీటిని పాటిస్తే చర్మ సమస్యలు ఎప్పటికీ మీ దరిచేరవు
X

దిశ, ఫీచర్స్: చర్మ అలెర్జీలు ఒక సాధారణ ఆరోగ్య సమస్య. వయస్సుతో సంబంధం లేకుండా, ప్రజలు ఈ వ్యాధికి గురవుతారు. ఆహారంలో మార్పులు, నీరు మారడం వలన మనలో చాలామంది ఒక్కసారైనా ఈ సమస్యను ఎదుర్కొనే ఉంటారు. కాలుష్యం, సూర్యరశ్మి వల్ల కూడా చర్మానికి అలర్జీలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. వేసవిలో, ఈ సమస్య బారిన పడే వారి సంఖ్య ముఖ్యంగా ఎక్కువగా ఉంటుంది.

దురద, చర్మం ఎర్రబడటం, దద్దుర్లు వంటి లక్షణాలు సాధారణంగా చర్మ అలెర్జీలతో సంభవిస్తాయి. సమస్యకు సత్వరమే చికిత్స తీసుకోకపోతే, అలర్జీ వచ్చే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో అలర్జీలు శరీరమంతా వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. అయితే, కొన్ని చిట్కాలు పాటించి డైట్ మార్చుకోవడం వల్ల స్కిన్ అలర్జీ సమస్యను తగ్గించుకోవచ్చు. అవేంటో ఇక్కడ చూద్దాం..

స్కిన్ అలర్జీ సమస్యలు రాకుండా ఉండాలంటే తీసుకునే ఆహారంలో విటమిన్ సి, ఇ, బీటా కెరోటిన్ పుష్కలంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. పండ్లు, కూరగాయలు, వాల్‌నట్‌లు, బీట్‌రూట్ వంటి ఆహారాలలో ఈ విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. డైట్ లో రెగ్యులర్ గా ఉండేలా చూసుకోవాలని అంటున్నారు. అంతే కాకుండా, పెరుగు, ఎండుద్రాక్ష వంటి ప్రోబయోటిక్స్ చర్మాన్ని రక్షించడంలో సహాయపడతాయి. రోజుకు కనీసం 8 గ్లాసుల గోరువెచ్చని నీటిని తాగడం వల్ల చర్మ సమస్యలను నివారించవచ్చు.

Read More..

అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారా.. అయితే ఈ వాస్తుచిట్కాలు పాటించి చూడండి!

Advertisement

Next Story