Negative Feelings: శృంగారం ముగింపు ఆందోళనగా ఉంటుందా..? అయితే ఇలా చేయండి!!

by Prasanna |   ( Updated:2023-03-03 09:56:01.0  )
Negative Feelings: శృంగారం ముగింపు ఆందోళనగా ఉంటుందా..? అయితే ఇలా చేయండి!!
X

దిశ, ఫీచర్స్: శృంగారంలో పాల్గొన్న తర్వాత విచారం, ఆందోళన లాంటి ప్రతికూల భావోద్వేగాలను అనుభవిస్తున్నారా? అయితే మీరు ‘పోస్ట్-కోయిటల్ డిస్ఫోరియా’తో బాధపడుతున్నట్లే అంటున్నారు నిపుణులు. లైంగిక కార్యకలాపాలు సంతృప్తికరంగా, ఆహ్లాదకరంగా ఉన్నప్పటికీ ముగింపులో మాత్రం తీవ్ర నిరాశను పొందవచ్చు. ఈ పరిస్థితిని ‘పోస్ట్-సెక్స్ బ్లూస్’ అని పిలుస్తుండగా.. ఆడ, మగ ఇద్దరిలోనూ తలెత్తుతుందని అంటున్నారు.

కారణాలు :

* గతంలో లైంగిక వేధింపులకు గురికావడం

* సాధారణ ఆందోళన, ఒత్తిడి

* ప్రసవానంతర డిప్రెషన్

* హార్మోన్ల హెచ్చుతగ్గులు

*సెక్స్ గురించి నమ్మకాలు

* బాడీ ఇమేజ్ ఇష్యూస్

* రిలేషన్‌షిప్ ఇష్యూస్

ఎలా ఎదుర్కోవచ్చు?

* మొదట మీ ఆలోచనలను అదుపులో పెట్టేందుకు శ్వాసపై దృష్టి పెట్టండి.

* ఆందోళనతో ఆలోచనలు చుట్టుముడుతుంటే.. ప్రజెంట్‌పై దృష్టి సారించడం ద్వారా మిమ్మల్ని మీరు ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. ఉదాహరణకు, మీ ముందు కనిపించే వస్తువులకు పేరు పెట్టడం ద్వారా ప్రారంభించవచ్చు.

* మీకు మీరే ఇలా ప్రశ్నించుకోండి:

- నేను సురక్షితంగా ఉన్నానా?

- ప్రస్తుతం ఏం జరుగుతోంది?

- ఇప్పుడు నాకు ఏం కావాలి?

మీ పార్ట్‌నర్ ఆందోళన చెందితే..

* వారు చెప్పాలనుకున్నది వినండి.

* వారికి పర్సనల్ స్పేస్ కావాలంటే ఇవ్వండి.

* వారు సిద్ధంగా ఉన్నప్పుడు రెడీగా ఉన్నామనే విషయాన్ని వివరించడం ముఖ్యం.

సంకోచం వద్దు..

* ‘పోస్ట్ కోయిటల్ డిస్ఫోరియా’ కోసం సహాయం కోరడంలో ఎలాంటి సంకోచం ఉండకూడదు. కొన్ని సెక్స్ అండ్ సైకలాజికల్ థెరపీస్ పరిస్థితిని అధిగమించడంలో సహాయపడతాయి.

* మీ అవసరాల గురించి భాగస్వామితో కమ్యూనికేట్ అవండి.

* ధ్యానం, యోగా వంటి ఆరోగ్యకరమైన జీవనశైలి మార్పులతో ఉపశమనం పొందేందుకు ప్రయత్నించండి.

ఇవి కూడా చదవండి : సంతృప్తి పరిస్తే చాలు.. ఏజ్‌తో పనేంటి..?

Advertisement

Next Story