వర్షాకాలంలో ఈ ఒక్క కషాయం తాగితే దగ్గు, జలుబు ఇట్టే మాయం..!

by Kavitha |
వర్షాకాలంలో ఈ ఒక్క కషాయం తాగితే దగ్గు, జలుబు ఇట్టే మాయం..!
X

దిశ, ఫీచర్స్: సాదారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలు దగ్గు, జలుబుతో చాలా మంది ఇబ్బంది పడతారు. ఈ సమస్య పిల్లలతో పాటు పెద్దలను కూడా ప్రభావితం చేస్తాయి. అయితే జలుబు లేదా దగ్గు రాగానే మనం మెడికల్ షాపులకి పరుగులు తీస్తాం. ఇప్పుడు నేను చెప్పే చిట్కాలు పాటిస్తే మెడికల్ షాపుకి వెళ్లి మందులు తీసుకోవాల్సిన అవసరం లేకుండా ఈ సమస్యలకు ఇంట్లో చిట్కాలతోనే బై బై చెప్పేయవచ్చు.

జలుబు దగ్గు సమయంలో కషాయం తాగితే మంచి ఫలితం ఉంటుంది. అదేవిధంగా నివారణిగా కషాయం చాలా బాగా పనిచేస్తుంది. అయితే దీనిని కష్టపడకుండా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. కషాయం ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఒక అర చెంచా పసుపు పొడి, అర చెంచా అల్లం పొడి లేదా అర చెంచా పచ్చి అల్లం, లవంగాల పొడి, అర స్పూన్ దాల్చిన చెక్క పొడులను కలిపి ఈ మిశ్రమంలో కాస్త నీళ్లు పోసి ఐదు నిమిషాలు మరిగించాలి. ఈ తర్వాత స్టౌ ఆఫ్ చేసి అందులో కాస్త నిమ్మరసం, ఒక చెంచా తేనె కలిపి దీన్ని రోజుకు రెండు సార్లు తాగితే దగ్గు, జలుబు మాయం అవుతుంది. కషాయాలను తీసుకోవడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సాధారణ జలుబు, దగ్గు కోసం వీటిని ప్రయత్నించవచ్చు. కచ్చితంగా కషాయం మంచి ఫలితాలను ఇస్తుంది.

పసుపు:

పసుపులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఎక్కువగా ఉంటాయి. బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్లతో పోరాడటానికి.. ఇది దగ్గు, జలుబును తగ్గించడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచడానికి ఉపయోగపడుతుంది.

అల్లం:

జలుబు, దగ్గు సమస్యలకు అల్లం దివ్యౌషధం. అల్లం మనం గృహ అవసరాలకు వాడుతుంటారు. అల్లం గొంతు నొప్పి విపరీతమైన చికాకు కలిగించే దగ్గును తగ్గిస్తుంది. వర్షాకాలంలో క్రమం తప్పకుండా అల్లం వాడకం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.

నిమ్మరసం:

నిమ్మరసంలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి ఉపయోగపడుతుంది. దగ్గు, జలుబును నివారించడంలో కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది.

దాల్చిన చెక్క పొడి:

సాధారణంగా కొంతమందికి దాల్చిన చెక్క వాసన అస్సలు నచ్చదు. కానీ దాల్చిన చెక్క పొడి గొంతు నొప్పి నివారించడంలో చాలా బాగా సహాయపడుతుంది. ఈ చెక్కను ఉపయోగించడం ద్వారా అనేక ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి.

తేనె:

కషాయంలో తేనెను వాడటం వలన ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు క్రిములతో పోరాడడానికి ఉపయోగపడతాయి. దీంతో జలుబు, దగ్గును ఇట్టే తగ్గిపోతుంది.

Advertisement

Next Story