Tea and coffee: టీ తాగితే ఒకలా.. కాఫీ తాగితే మరోలా.. అసలు విషయం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.

by Javid Pasha |   ( Updated:2024-10-08 15:37:24.0  )
Tea and coffee: టీ తాగితే ఒకలా.. కాఫీ తాగితే మరోలా.. అసలు విషయం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.
X

దిశ, ఫీచర్స్ : టీ, కాఫీ, సోడాలు, ఫ్రూట్ జ్యూస్ వంటి పానీయాలు తాగడం మీకిష్టమా? అయితే కొంచెం జాగ్రత్త. ఎందుకంటే వీటిని మీరు తాగే మోతాదులను బట్టి స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతాయని కెనడాలోని మెక్ మాస్టర్ యూనివర్సిటీ పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది. ముఖ్యంగా రోజుకు 4 కప్పుల కాఫీ తాగడంవల్ల స్ట్రోక్ రిస్క్ పెరుగుతుందని, రోజుకు 3 నుంచి 4 కప్పుల బ్లాక్ లేదా గ్రీన్ టీ తాగితే మాత్రం ఆ ప్రమాదం నుంచి మిమ్మల్ని రక్షిస్తుందని పరిశోధకులు చెప్తున్నారు.

అధ్యయన వివరాల ప్రకారం.. కాఫీ, సోడా, అధిక చక్కెరలు కలిగిన వివిధ తియ్యటి పానీయాలు, ఆహారం, జీరో షుగరింగ్ స్వీటెనర్స్ స్ట్రోక్ వచ్చే అవకాశాన్ని 22 శాతం పెంచుతాయి. అంతేకాకుండా రోజుకు రెండు లేదా అంతకంటే ఎక్కువ డ్రింక్స్ తీసుకోవడం వల్ల కూడా రిస్క్ పెరుగుతుంది. అయితే ఫిజీ డ్రింక్స్, సోడా మధ్య సంబంధం దక్షిణ అమెరికా, తూర్పు, మధ్య ఐరోపా, ఆఫ్రికా దేశాల్లో ఎక్కువగా ఉంది. అలాగే ఇక్కడ ఎక్కువ చక్కెరలు కలిగిన పండ్ల రసాలు తరచుగా తాగితే ‘ఇంట్రాక్రానియల్ హేమరేజ్’ కారణంగా మహిళల్లో స్ట్రోక్ ముప్పు 37 శాతం పెరుగుతుంది.

రోజుకు 4 కప్పులకంటే ఎక్కువగా కాఫీ తాగితే స్ట్రోక్ వచ్చే ప్రమాదం 37 శాతం పెరుగుతుందని అధ్యయనం వెల్లడించగా.. టీ తాగడంవల్ల మాత్రం 18 నుంచి 20 శాతం ఈ ముప్పు తగ్గుతుందని దానిని ఎనలైజ్ చేసిన పరిశోధకులు చెప్తున్నారు. ఇక రోజుకు 3 నుంచి 4 కప్పులు గ్రీన్ టీ తాగితే స్ట్రోక్ వచ్చే చాన్సెస్ 27 శాతం తగ్గుతాయి. ముఖ్యంగా పాలు కలిపిన టీ తాగడంవల్ల అందులోని యాటీ ఆక్సిడెంట్ల ప్రభావం కారణంగా స్ట్రోక్ వచ్చే రిస్క్ తగ్గుతుందని రీసెర్చర్స్ అంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed