మీ గ్లామర్ పెరగాలా?.. మునగాకు రసం, అలోవెరా జెల్‌ వాడండి !

by samatah |   ( Updated:2023-08-16 14:40:48.0  )
మీ గ్లామర్ పెరగాలా?.. మునగాకు రసం, అలోవెరా జెల్‌ వాడండి !
X

దిశ, ఫీచర్స్ : చాలామంది ఏజ్‌తో సంబంధం లేకుండా ఇంట్రెస్ట్ చూపే విషయాల్లో గ్లామర్ ఒకటి. బాడీ, ఫేస్ అట్రాక్టివ్‌గా ఉండాలని, యంగెస్ట్ లుక్‌‌తో కనిపించాలని ప్రతీ ఒక్కరు కోరుకుంటారు. అందుకోసం రకరకాల లోషన్లు, క్రీములు, పౌండర్లు, బ్యూటీ ప్రొడక్ట్స్ వాడుతుంటారు. అయితే ఇవన్నీ ఎక్కువ ఖర్చుతో కూడుకున్నవని తెలిసిందే. అయితే ఎటువంటి ఖర్చు లేకుండా ఇంటి పెరట్లోనో, చుట్టు పక్కల పరిసరాల్లోనో లభించే ట్రెడీషనల్ మూలికలు, వస్తువులతో కూడా గ్లామర్ పెంచుకోవచ్చని ఆయుర్వేదిక్ నిపుణులు సూచిస్తున్నారు. అలాంటి వాటిలో మునగాకు రసం, అలోవెరా జెల్, ఇంకా వివిధ సంప్రదాయ మూలికలు అద్భుతంగా పనిచేస్తాయని చెప్తున్నారు.

ఏం చేయాలంటే..

ఫేస్‌లో గ్లామర్ మరింత పెరగడానికి మునగాకు ఔషధంలా పనిచేస్తుంది. పిడికెడు ఆకుల్ని తీసుకొని, మెత్తగా నూరడం ద్వారా వచ్చే రసాన్ని ప్రతిరోజు పడుకునే ముందు ముఖానికి, మెడ భాగంలో అప్లయ్ చేయాలి. ఉదయాన్నే గోరు వెచ్చని నీటితో స్నానం చేయాలి. కొంతకాలం ఇలా చేస్తే ముఖంపై, మెడపై నలుపు ఛాయలు, మొటిమలు, ముడతలు తగ్గిపోతాయి. స్కిన్‌లో యంగెస్ట్ షైనింగ్ కనిపిస్తుంది. చాలామంది కళ్లకింద నలుపు లేదా ముడతలతో ఇబ్బంది పడుతుంటారు. ఇందుకు చక్కటి పరిష్కారం ఏంటంటే.. ఒక చిన్న కప్పులో పాలను తీసుకొని, అర స్పూన్ తేనె క‌లిపి ముడతలు, నలుపు ఉన్న భాగాల్లో నిద్రకు ముందు అప్లయ్ చేయాలి. ఉదయాన్నే గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. వారంరోజుల్లో సమస్య దూరం అవుతుంది. కొందరికి తరచుగా పెదవులు తడి ఆరిపోవడం, పగుళ్లు ఏర్పడటం, ముఖంపై షైనింగ్ తగ్గడం జరుగుతూ ఉంటాయి. ఈ సమస్య ఉన్నవారు ప్రతిరోజు నిద్రపోయేకంటే ముందు అలోవెరా జెల్‌ను పెదవులపై, ముఖంపై అప్లయ్ చేసి, రెండు గంటల తర్వాత చల్లటి నీటితో కడగాలి. దీంతో క్రమంగా పెదవులు సాధారణ స్థితికి వస్తాయి. ముఖ వర్ఛస్సు పెరుగుతుంది. ఈ టిప్స్‌తోపాటు తరచూ పౌష్టికాహారం, తాజా పండ్లు తీసుకోవడం కూడా గ్లామర్ పెరిగేందుకు దోహదం చేస్తాయని ఆయుర్వేదిక్ నిపుణులు సూచిస్తున్నారు.

Read More: స్ట్రెస్ నుంచి రిలీఫ్ కోరుకుంటున్నారా?.. అయితే ఇలా చేయండి

Advertisement

Next Story