- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఒక వారం పాటు టీ మానేస్తే .. మన శరీరంలో జరిగేది ఇవే.. !
దిశ, ఫీచర్స్ : కొంతమందికి ఉదయం, సాయంత్రం టీ తాగే అలవాటు ఉంటుంది. మరి కొంతమంది అదే పనిగా టీ తాగుతూనే ఉంటారు. ఇంకొందరికి టీ లేకుండా ఏ పని కూడా చేయలేరు. దేశవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన పానీయాలలో టీ ఒకటి. పాలలో కొద్దిగా పంచదార, ఒక టీ స్పూన్ టీపొడి వేసి బాగా మరిగిస్తే టీ తయారవుతుంది. అయితే, వారం రోజులు టీ తాగడం మానేస్తే.. మన శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో ఇక్కడ చూద్దాం..
ఎంత ఒత్తిడిలో ఉన్నా ఒక్క కప్పు టీ తాగితే రోజంతా ఉత్సహంగా పని చేస్తారు. అయితే, ఎక్కువగా టీ తాగడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. అందువల్ల, టీ వినియోగం మితంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మధుమేహ వ్యాధిగ్రస్తులు చక్కెర లేకుండా టీ తీసుకుంటున్నారు. కొంత మంది అనారోగ్య సమస్యల కారణంగా బ్లాక్ టీ, లెమన్ టీ, గ్రీన్ టీ తాగుతుంటారు.
వారం రోజుల పాటు టీ తాగడం మానేస్తే.. అజీర్ణం, అసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి. మీరు పేగు వ్యాధులతో బాధపడుతుంటే టీ ని దూరం పెట్టాలని వైద్యులు చెబుతున్నారు. టీ ఒక్కసారిగా ఆపేయడం వల్ల గుండెల్లో మంట, తలతిరగడం, గుండె వేగంలో హెచ్చుతగ్గులు వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. మీ చేతులు వణుకుతున్నట్లయితే, టీ తాగడం వల్ల ఈ సమస్య మరింత తీవ్రతరం అవుతాయి. ఒక వారం పాటు టీ తాగడం మానేస్తే, మీ అధిక రక్తపోటు సాధారణ స్థితికి వస్తుంది.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.