Relationship: భార్య సంతోషంగా ఉండాలంటే.. భర్త చేయాల్సిన పనులివే

by Prasanna |   ( Updated:2024-08-19 14:56:04.0  )
Relationship: భార్య సంతోషంగా ఉండాలంటే.. భర్త చేయాల్సిన పనులివే
X

దిశ, ఫీచర్స్ : కొత్తగా పెళ్ళైన జంట కొన్ని నెలలు సంతోషంగానే ఉంటారు. అయితే, రోజులు గడిచే కొద్దీ వైవాహిక జీవితం బోర్ గా అనిపించడం స్టార్ట్ అవుతుంది. అలాంటి సమయంలో భార్యను సంతోషపెట్టాలి. దాని కోసం, భర్త ఈ పనులు చేయాలని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇక్కడ చూద్దాం..

ఎల్లప్పుడూ గౌరవించాలి

మీరు వెళ్లే ప్రదేశానికి మీతో పాటు మీ భార్యను కూడా తీసుకెళ్లినప్పుడు ఆమెను జాగ్రత్తగా చూసుకోండి. ఆ సమయంలో మీ భార్య మీ నుంచి గౌరవాన్ని కోరుకుంటుంది. దాని వలన మీ వైవాహిక బంధం కూడా బలపడుతుంది. తన భర్త తనకు తగినంత గౌరవాన్ని ఇస్తున్నాడని ఆమె కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది.

స్నేహితుడిలా ఉండండి

భార్యాభర్తలు ఫ్రెండ్స్ లా ఉండటం వలన ఆనందంగా సాగుతుంది. ఎందుకంటే మంచి, చెడులో ఇద్దరూ ఒకరికొకరు తోడుగా నిలబడాలి. అలాగే ఒకరి అవసరాలను ఇంకొకరు అర్థం చేసుకోవాలి. ఈ విధంగా చేయడం వలన భార్యాభర్తల మధ్య ప్రేమ పెరిగి మీ బంధం బలపడుతుంది.

ఇద్దరూ సమానమే

ఏ విషయంలోనైన ఇద్దరూ సమానమని అనుకోవాలి. అలాగే మీ భార్యను కూడా సమానంగా చూస్తే అమెంటో మీకు త్వరగ అర్ధమవుతుంది. భర్త తన భార్యపై చీటికీ మాటికి గొడవలకు వెళ్ళకూడదు. నా కన్నా నీ సంపాదన చాలా తక్కువ అని ఎప్పుడూ మీ భార్యను కించపరచకూడదు.ఇద్దరూ కూర్చొని కలిసి నిర్ణయం తీసుకోవాలి.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు నుంచి తీసుకోబడింది. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.


Read more...

Self Love challenge:30 డేస్‌లో మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం ఎలా సాధ్యమవుతుంది.. ఈ చాలెంజ్ ఎప్పుడైనా ఫేస్ చేశా...




Advertisement

Next Story