Normal delivery: మొదటి డెలివరీలో సి సెక్షనైతే రెండో కాన్పులో నార్మల్ అవుతుందా? మీ అపోహలకు సమాధానాలివే..!

by Anjali |
Normal delivery: మొదటి డెలివరీలో సి సెక్షనైతే రెండో కాన్పులో నార్మల్ అవుతుందా? మీ అపోహలకు సమాధానాలివే..!
X

దిశ, వెబ్‌డెస్క్: నార్మల్ డెలివరీ అవ్వాలని చాలా మంది కోరుకుంటారు. కానీ నార్మల్ డెలివరీ విషయంలో అనేక అపోహలు ఉంటాయి. చాలా మందిలో భయంతో కూడిన ఎన్నో ప్రశ్నలు తలెత్తుతాయి. ఎందుకంటే నార్మల్ డెలివరీ అయ్యేటప్పుడు భరించలేని నొప్పి ఉంటుందని అంటారు. దీంతో కొంతమంది సి సెక్షన్ బెటర్ అని ఫీల్ అవుతారు. కాగా సి సెక్షన్ అండ్ నార్మల్ డెలివరీ గురించి మీ అపోహలకు నిపుణులు చెప్పిన ఈ సమాధానాలు ఇప్పుడు చూద్దాం.

సిజేరియన్ & నార్మల్ డెలివరీ

చాలా మంది సిజేరియన్ కన్నా నార్మల్ డెలివరీ పెయిన్ ఎక్కువగా ఉంటుందని భావిస్తారు. కొంతమంది సిజేరియల్ నొప్పి ఎక్కువగా ఉందని అనుకుంటారు. పురిటి నొప్పులు భరించడం ప్రస్తుత రోజుల్లోని మహిళల వల్ల కాదని భయపడుతుంటారు. అయితే సిజేరియన్ పెయిన్ నుంచి కోలుకోవడానికి చాలా ఎక్కువ టైమ్ పడుతుంది. నార్మల్ అయితే తక్కువ సమయం పడుతుంది.

నొప్పి రాకుండా శ్వాస వ్యాయామాలు చేయండి..

కానీ డెలివరీ సమయంలో ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటే నార్మల్ డెలివరీ శ్రేయస్కారం. దృఢ నిశ్చయంతో ఉంటే సాధ్యం కానిదంటూ ఏమి లేదు. నార్మల్ డెలివరీ సమయంలో పెయిన్ తగ్గించుకోవడానికి ఎన్నో శ్వాస వ్యాయామాలు కూడా ఉన్నాయి. వాటిని సాధన చేస్తే సరిపోద్ది.

మొదటి కాన్పూలో సిజేరియనైతే రెండోసారి నార్మల్ డెలివరీ అవుతుందా?

ఇకపోతే ఫస్ట్ కాన్పులో సిజేరియన్ అయితే రెండోసారి నార్మల్ కాదని చాలా మంది భావిస్తారు. కానీ అది జస్ట్ అపోహ మాత్రమే అని గుర్తుంచుకోండి. అది ప్రెగ్నెన్నీ మధ్య గ్యాప్ ను బట్టి ఉంటుంది. దానిపై ఆధారపడి ఉంటుంది తప్ప సి సెక్షన్ తర్వాత నార్మల్ కాదని కాదు. నార్మల్ డెలివరీ అయితే గర్భాశయం జారిపోతుందని అంటారు. అది కూడా ఒక అపోహ అని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story

Most Viewed