- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇంట్లో మనిషి చనిపోతే గుండు ఎందుకు కొట్టించుకోవాలి..?
దిశ, వెబ్‌డెస్క్ : మన భారతదేశం సాంప్రదాయాలకు పుట్టినిల్లు. రాష్ట్రాలు, ప్రాంతాలను బట్టి సంస్కృతులు, ఆచారాలు మారుతుంటాయి. ఇలాంటి ఆచారంలో భాగంగానే భర్త చనిపోతే భార్య బొట్టు, పూలు, గాజులు తీసేసి వితంతువును చేస్తారు. అలాగే కుటుంబంలో ఎవరైనా చనిపోతే 11 రోజుల పాటు ఇంట్లో నుంచి బయటికి వెళ్లకుండా ఉంటారు. అలాగే తండ్రి చనిపోయినప్పుడు కొడుకులు తప్పకుండా శిరోముండలం (గుండు) చేయించుకుంటారు. తల్లిదండ్రుల మరణానంతరం గుండు ఎందుకు చేసుకోవాలో దానికి కారణం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఒక మనిషి చనిపోయినప్పుడు ఆ ఇంట్లో సూతకం ఉంటుంది అంటారు. అలాంటి సమయంలో ఆ ఇంటి మగవారు తలనీలాలు, గడ్డం, మీసాలను తీసేస్తే సూతకం పోతుందని నమ్మకం. అలాగే మరణించిన వ్యక్తికి మనం గౌరవం ఇస్తున్నాం అని తెలియజేసేందుకు ఇంట్లో ఉండే మగవారు తమ గడ్డాన్ని, తలనీలాలను సమర్పిస్తారు. మనిషిలో ఉన్న అహంకారం జుట్టులో ఉంటుందట. అందుకే తమ అహాన్ని నాశనం చేశామనడానికి చిహ్నంగా కుటుంబంలోని మగవారు తలనీలాలను ఇస్తారట. కుటుంబంలో ఎవరైనా చనిపోయినప్పుడు అంత్యక్రియలు చేయాలనుకునే వారు తప్పకుండా తలనీలాలు తీయడం ఆచారం. అలా చేస్తే ఆయనపై మీకు ఇంకా నమ్మకం, గౌరవం ఉన్నట్లు తెలుపుతుంది. మరోవైపు గుండు చేయించుకోకపోతే అరిష్టాలు చుట్టుకుంటాయని, ఋణ బంధం వీడక పితృదోషాలు వెంటాడుతాయని శాస్త్రం చెబుతుంది. అందుకే ఈ ఆచారాన్ని పూర్వికుల కాలం నుంచి హిందువులు పాటిస్తున్నారు.