- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లవ్ ఫీవర్ ను ఇలా గుర్తించండి.. లేదంటే అనారోగ్య సమస్యలు వేధిస్తాయి
దిశ, ఫీచర్స్: మీరు ఎవరినైనా గాఢంగా లవ్ చేస్తున్నప్పుడు మీ భావోద్వేగాలు మీ మనసును బాధిస్తాయి. కొన్నిసార్లు అయితే మీ చుట్టూ చాలా మంది ఉన్నా .. మీ మనసులో ఉన్న వారు మీ పక్కన లేరని ఫీల్ అవుతారు. ప్రేమ బంధంలో ఒకరికొకరు ఎక్కువ సమయం కేటాయించాలని కోరుకుంటారు. ఇలా జరగనప్పుడు, ఒత్తిడికి గురయ్యి కోపంతో మీ ప్రియమైన వారిని మాటలు అనేస్తారు. ఈ సమయంలో మీరు అనుభవించే అనుభూతిని ప్రేమ జ్వరం అంటారు. దీనిని ఇలా గుర్తించండి.. లేదంటే అనారోగ్య సమస్యలు వేధిస్తాయని నిపుణులు అంటున్నారు.
ఏకాగ్రత లేకపోవడం: ప్రేమ ఒక అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంది. లవ్ ఫీవర్ లో ఉన్నప్పుడు మీరు చేయాల్సిన పనులు కూడా పక్కన పెట్టి అదే ధ్యాసలో ఉంటారు. చదువుకున్నా, హోంవర్క్ చేస్తున్నా.. మీ ఆలోచనలు మీరు ఇష్టపడే వ్యక్తి చుట్టూ తిరుగుతుంటాయి.
అతిగా ఆలోచించడం: ప్రేమలో పడిన తర్వాత ప్రతి విషయాన్ని అతిగా ఆలోచించడం సర్వసాధారణం. మీరు ఒక వ్యక్తి యొక్క పదాలను వారి భావోద్వేగాలతో కనెక్ట్ చేసుకోవడం మొదలుపెడతారు. అటువంటి పరిస్థితిలో, మీరు ఆకర్షించబడిన వ్యక్తి యొక్క ప్రతి చర్య మీ దృష్టిని ఆకర్షిస్తుంది.
ప్రవర్తనలో కొత్త మార్పులు: ప్రేమలో పడిన తర్వాత కొంతమంది వారి ప్రేమకథకు జీవం పోసేందుకు తమ ప్రవర్తనను పూర్తిగా మార్చుకుంటారు. ఒకసారి ప్రేమలో మునిగాక వీరి జీవితం గురించి పట్టించుకోవడం మానేసి మనసులో ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వడం ప్రారంభిస్తారు. అప్పటి నుంచి కుటుంబం, బంధువులతో మాట్లాడే తీరు కూడా మారుతుంది.