- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఒకరి మాంసాన్ని మరొకరు తిన్న కసాయి మానవులు.. 1.45మిలియన్ ఏళ్లుగా..
దిశ, ఫీచర్స్: మానవత్వం అంటేనే ఇతరుల పట్ల దయ చూపడం, కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడం. జంతువులకు మనుషులకు ఉన్నా తేడా కూడా ఇదే. ఎమోషన్స్‌కు ఇంపార్టెన్స్ ఇవ్వడం. తోటివారిని అక్కున చేర్చుకుని.. కడుపు నిండా భోజనం పెట్టడం. కానీ మన పూర్వీకుల్లో ఇలాంటి మానవత్వపు విలువలు లేవని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. దారుణమైన కసాయి వారిగా బతికారని.. ఒకరి మంసాన్ని మరొకరు తినేవారని వివరించారు.
సైంటిఫిక్ రిపోర్ట్స్ జర్నల్‌లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. ఉత్తర కెన్యాలో కనుగొనబడిన 1.45 మిలియన్ ఏళ్ల కిందటి హ్యూమన్ లెఫ్ట్ షిన్ బోన్‌పై తొమ్మిది కట్ మార్కులను విశ్లేషించారు పరిశోధకులు. ఇది మానవ సాపేక్ష జాతులలో నరమాంస భక్షకానికి సంబంధించిన పురాతన ఉదాహరణగా పేర్కొన్నారు. ఆ శరీరంపై పెద్ద పులికి సంబంధించిన రెండు కాటు గుర్తులుండగా.. మిగిలిన తొమ్మిది గాయాలు మానవులు వేటాడి తిన్నట్లుగా ఉన్నాయని గుర్తించారు. ఈ కటింగ్స్ రాతి పనిముట్లతో చేశారని.. ఆచారం కోసం కాకుండా పోషకాహారం కోసం మాత్రమే ఇలా చేసినట్లు అనిపిస్తుందన్నారు. అయితే ఇందుకు తగిన సాక్ష్యాధారాలు లేవు కానీ యూరప్, ఆఫ్రికాలోని పలు ప్రాంతాల్లో ఇలాంటి కసాయిలు ఉన్నారని చెప్పే్ందుకు మునుపటి ఆధారాలున్నాయి. కాగా ప్రస్తుతం శాస్త్రవేత్తలు ప్రారంభ మానవజాతుల మెదడులను పరిశీలించేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.
Read More: మిమ్మల్ని యవ్వనంగా మరియు ఆరోగ్యంగా ఉంచే అలవాట్లు ఇవే!