- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మనసును ఎలా మన అదుపులో ఉంచుకోవాలంటే?
దిశ, ఫీచర్స్ : మన మనసు గురించి ఏం చెప్పాలో కూడా తెలియదు. ఎందుకంటే అది ఎవరికి అంత ఈజీగా అర్థం కాదు. క్షణాల్లో మనసు మార్చేస్తుంది. ఒకసారి ఈ పని చేయమని చెప్తే, మరోసారి వద్దని కొట్టేస్తుంది. ఒక్కోసారి ఆందోళన పెంచేస్తుంది. మనకు తెలియకుండానే మన మనసులో భయాన్ని క్రియేట్ చేస్తుంది. అందువలన మన మనసును మనం అదుపులో ఉంచుకోవాలంటున్నారు మానసిక నిపుణులు.
మన మనసు మన అదుపులో ఉండాలంటే కొన్ని టిప్స్ పాటించాలంట. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం. చిన్న చిన్న విషయాలకు మన మనసు మనల్ని ఆందోళనకు గురిచేస్తోంది. అందువలన అలాంటి సమయంలో మనం శ్వాస వ్యాయామం చేయాలంట. ఎక్కువసేపు, మెడిటేషన్ ప్రాక్టీస్ చేయాలంట. దీని వలన మన మనసు కాస్త ప్రశాంతంగా ఉంటుందంట.
మన మనసును ఒకే విషయంపై ఏకాగ్రం చేయడం. మనకు నచ్చిన పని చేస్తూ.. దాని మీదనే కాన్సంట్రేషన్ చేయడం వలన మన మనసు మన ఆధీనంలో ఉంటుందంట. మన మనసును మనం అదుపులో పెట్టుకోవాలంటే, మన బలహీనతలను మనం అధిగమించాలంటే. దాని వలన మన జీవితంలో మనం ఈజీగా సక్సెస్ కావొచ్చు అంటున్నారు నిపుణులు. అలాగే మనం ఎక్కువ సేపు ప్రశాంతంగా నిద్రపోవాలంట. దీని వలన మనం మానసికంగా చాలా ఆరోగ్యంగా ఉంటుందంట.