Health tips: గుండె జబ్బులు ఉన్నవారు రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలి?

by Javid Pasha |
Health tips: గుండె జబ్బులు ఉన్నవారు రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలి?
X

దిశ, ఫీచర్స్ : మీరు ఆరోగ్యంగా ఉండాలంటే తప్పక చేయాల్సిన పనుల్లో శరీరానికి సరిపడా నీరు తాగడం. లేకపోతే బాడీ డీహైడ్రేటెడ్‌గా మారుతుంది. అలసట అధికం అవుతుంది. మానసిక స్థితిలో ప్రతికూల మార్పులు వస్తాయి. క్రమంగా డీహైట్రెట్‌కు గురై ఇతర అనారోగ్యాలకు దారితీస్తుందని నిపుణులు చెప్తుంటారు. అలా జరగకూడదంటే పిల్లల నుంచి పెద్దల వరకు ఎక్కువ నీరు తాగాలని చెప్తుంటారు. ముఖ్యంగా ఒక వ్యక్తి రోజుకు 3 నుంచి 4 లీటర్లు లేదా 7 నుంచి 8 గ్లాసుల వరకు తాగడం మంచిది. కానీ ఇది గుండె జబ్బులు ఉన్నవారికి వర్తించదనే విషయం మీకు తెలుసా? మరి వీరు ఎంత నీరు తాగాలో ఇప్పుడు చూద్దాం.

సాధారణంగా శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడంలో నీరు ఎక్కువగా తాగడం కీలకపాత్ర పోషిస్తుంది. గుండె జబ్బులు ఉన్నవారిలో మాత్రం ఇందుకు భిన్నంగా జరగుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఎందుకంటే వీరి శరీరంలో సోడియం, పొటాషియం, ఎలక్ట్రోలైట్స్ వంటి మినరల్స్‌ సమతుల్యంగా ఉండాలి. నీరు అధికంగా తాగితే ఈ సమతుల్యత దెబ్బతింటుందని కార్డియాలజిస్టులు అంటున్నారు. పైగా గుండె జబ్బులు ఉ్నవారిలో ఈ పరిస్థితి ‘గుండె పంపింగ్ సామర్థ్యం’ దెబ్బతినేందుకు కారణం కావచ్చు. అలాగే గుండెపై ఒత్తిడి పెరగడం, ధమనులు బలహీనంగా మారడం, హార్ట్ రేట్ తగ్గడం వంటివి సంభవించే అవకాశాలు ఉంటాయి. మూత్ర పిండాలపై కూడా ఒత్తిడి పెరుగుతుందని హృద్రోగ నిపుణులు చెప్తున్నారు. కాబట్టి గుండె జబ్బులు ఉన్నవారు రోజుకు 2 లీటర్లకు మించి నీరు తాగకపోవడమే సురక్షితమని చెప్తున్నారు.

*నోట్ : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దీనిని ‘దిశ’ ధృవీకరించడం లేదు. అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story

Most Viewed