కుక్కలు మనిషి చావును ఎలా ముందే పసి గడుతాయి..?

by S Gopi |   ( Updated:2022-12-17 13:53:36.0  )
కుక్కలు మనిషి చావును ఎలా ముందే పసి గడుతాయి..?
X

దిశ, వెబ్ డెస్క్: జంతువులలో కుక్కల ప్రత్యేకత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విశ్వాసానికి చిహ్నంగా కుక్కను చూపిస్తాడు మనిషి. మరే ఇతర జంతువు కూడా కుక్క అంత దగ్గరకు మనిషికి చేరవవు. అయితే, కుక్కలు ముందే మనిషి చావును పసి గడుతాయమంటారు. వాటి వ్యవహార శైలీలో మార్పులను బట్టి ఆ విషయాన్ని ఇట్టే గుర్తుపట్టేయొచ్చని చెబుతుంటారు. పలువురు ప్రముఖులు కూడా ఇదే చెబుతుంటారు. అయితే, కుక్క కాలం యొక్క తీరును, కాల గమనంలో తేడాను కుక్క గుర్తించగలదు. కుక్క నోరు తెరిచి గాల్లోకి అరిస్తే అక్కడ దెయ్యాలు తిరిగాడుతుంటాయని కొందరు నమ్ముతుంటారు. మార్క్ బ్రౌన్ అనే రచయిత కుక్కలపై ఓ పుస్తకమే రాశాడు. ఏడు గిట్టలు ఉన్న కుక్కలకు దెయ్యాలు కనిపిస్తాయని, అదేవిధంగా వాటికి మృత్యువు ముందే తెలుస్తుందని అందులో పేర్కొన్నాడు. దెయ్యాలను చూడడం, మరణాన్ని పసిగట్టడం ఈ నేల మీద కుక్కలకు మాత్రమే సాధ్యమని కూడా అందులో పేర్కొన్నాడు. అదేవిధంగా మనిషి ఎప్పుడు చనిపోతాడోననేది కుక్కకు ముందే తెలుస్తుందని సైంటిఫిక్ గా కొందరు చెబుతుంటారు. గాలిలో రసయనాల మార్పులను బట్టీ అవి స్పందిస్తాయని, గాలి వాసనలోని ప్రమాదాన్ని అవి ఫీలై అవి ఏడవడం, అదేపనిగా గాల్లోకి చూసి అరుస్తాయని పలువురి సైంటిస్టుల వాదన. చావుకు దగ్గరవుతున్న మనిషి శరీరంలో వచ్చే రసాయన మార్పులు, వాసనను అవి పసిగట్టడం ఇప్పటి విషయం కాదు.. అందుకే కుక్కలను పెంచడం వందల ఏళ్లుగా వస్తోంది.. ఒక మనిషి మరణానికి దగ్గరవుతున్నప్పుడు కుక్కలు వాటి కాళ్ల గిట్టలను నేలపై రాసి గోతులు తీస్తాయని చెబుతుంటారు.



Also Read...

ఘోరం.. పబ్లిక్ పార్క్‌లో వీధి కుక్కపై అత్యాచారానికి పాల్పడ్డ కామాంధుడు (వీడియో)

Advertisement

Next Story

Most Viewed