గ్రహణం సమయంలో జంతువులు ఎలా ప్రవర్తిస్తాయి..?

by Anjali |   ( Updated:2024-04-08 15:22:57.0  )
గ్రహణం సమయంలో జంతువులు ఎలా ప్రవర్తిస్తాయి..?
X

దిశ, వెబ్‌డెస్క్: ఈ ఏడాది మొదటి సూర్యగ్రహణం నేడు (ఏప్రిల్ 8) రాత్రి ఏర్పడనుంది. ఈ గ్రహణం ఎక్కడ ఏర్పడనుంది? దీని ఎఫెక్ట్‌లు ఏంటనే విషయాలు చాలా మందికి తెలిసి ఉండవు. అయితే మెళ్లిమెళ్లిగా సంపూర్ణ గ్రహణానికి సంబంధించిన పలు విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా గ్రహణం సమయంలో వన్యప్రాణులు ఎలా స్పందిస్తాయని టెక్సాస్ రాష్ట్రంలోని జూలలో 20 జంతువులపై గ్రహణ ప్రభావాన్ని అధ్యయనం చేస్తున్నారు. దీని కోసం అమెరికా శాస్త్రవేత్తలు ఈ రోజు రాత్రి మూడు ఉపగ్రాహాలను ప్రయోగిస్తోంది నాసా. దీనిలోని ఓ ఉపగ్రహం ద్వారా గ్రహణం సమయంలో జంతువుల ప్రవర్తన ఎలా ఉందని పరిశీలించనున్నారు. దీనిలో భాగంగా ఈ రోజు రాత్రి ఎక్లిప్స్ ససౌండ్ స్కేప్ ప్రాజెక్టులో జంతువుల ప్రవర్తనలో గ్రహణ ప్రభావంపై పరిశీలన జరుగుతుంది. సంపూర్ణ సూర్యగ్రహణం వల్ల కలిగే చీకటిని చూసి జంతువులు స్పందన ఎలా ఉంటుంది? జంతువులు ఎలా ప్రవర్తిస్తాయి? అన్న పరిశోధకులు పరిశీలించనున్నారు. ఇందుకోసం జంతువులకు దగ్గరగా మైక్రోఫోన్‌లు ఏర్పాటు చేయనున్నారు. ఇక ఈ గ్రహణ ప్రయోగాల్లో ఏఐ ముఖ్య పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఏఐను ఉపయోగించి నాసా సూర్యుని చుట్టూ ఉండే వాతావరణాన్ని అధ్యయనం చేయనుంది. త్వరలో వీటి ఫలితాను నాసా వెల్లడించనుంది.

Advertisement

Next Story

Most Viewed