- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సూర్యుడి X-Ray.. ఏం చెప్తోంది?
దిశ, ఫీచర్స్ : సూర్యుడు భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రమే అయినా దాని గురించిన ఇంకా అనేక విషయాలు మనకు తెలియవు. మండుతున్న అగ్నిగోళం కాబట్టి కనీసం టెక్నాలజీ ద్వారా కూడా పరిశోధనలు చేయడం ఇప్పటికీ కష్టతరంగానే ఉంటోంది. అయినా సైంటిస్టులు అనేక మార్గాల్లో సౌర వ్యవస్థపై తమ పరిశోధనలు జరుపుతూనే ఉన్నారు. సూర్యుడిపై భాగం, దాని పరిసరాలు ఎలా ఉంటాయి? అక్కడ ఎందుకంత వేడి ఉంటుంది? సూర్యుడిపై ఉపరితలంపై వేలాడే జాలి వంటి పొర ఏమిటి? అది భూమి కంటే వంద రెట్లు ఎక్కువ వేడి ఉష్ణోగ్రతలను ఎందుకు కలిగి ఉంటుంది? అనే సందేహాలు పరిశోధకులకు అందని అంశంగానే ఉంటున్నాయి. ఈ క్రమంలోనే సూర్యుడిని ఎక్స్‌రే తీసిన శాస్త్రవేత్తలు.. అత్యంత వేడికి గల కారణాలకు ఉపరితల పొర కారణం కావచ్చని అనుకుంటున్నారు.
సూర్యడి ఎక్స్ రే ఏం చెప్తోంది?
నాసా ఇటీవల అత్యంత శక్తివంతమైన ఎక్స్‌రే టెలిస్కోప్‌లలో ఒకటైన 'న్యూక్లియర్ స్పెక్ట్రోస్కోపిక్ టెలిస్కోప్ అర్రే (నుస్టార్)' ద్వారా సూర్యుని వైపు ఫోకస్ పెట్టింది. ఈ ఎక్స్‌రే మెషిన్ సూర్యుడికి సంబంధించిన వివిధ అంశాలను బహిర్గతం చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంది. సూర్యుడిపై భాగంలో వేలాడుతూ ఉండే జాలి వంటి కాంతి పొరలో చాలా వేడి వాతావరణాన్ని కలిగి ఉందని సైంటిస్టులు తెలుసుకున్నారు. ఈ డేటాను ఆధారంగా సూర్యుడిపై గల వాతావరణంలో సంభవించే విస్ఫోటనాల సందర్భంలో పుట్టుకొచ్చిన పదార్థమే అత్యంత వేడి వాతావరణానికి కారణం కావచ్చనే విషయం న్యూక్లియర్ స్పెక్ట్రోస్కోపిక్ టెలిస్కోప్ మెషిన్ గ్రహించిన కాంతిని, తీసిన ఫొటోలను బట్టి తెలుస్తోంది. అయితే ఈ వేడి కాంతి విస్పోటనాలు సాధారణ సూర్యకాంతి కంటే అత్యంత వేడి వాతావరణాన్ని కలిగి ఉంటాయని సైంటిస్టులు అర్థం చేసుకున్నారు. సూర్యడిపై భాగంలోని ప్రకాశవంతమైన కాంతి పొరను మరింత వేడిగా, అక్కడి వెదర్ వేడి ఉష్ణోగ్రతలు కలిగి ఉండేందుకు కారణం అవుతోంది. వేల డిగ్రీల సెల్సియస్‌ల వేడి పుట్టించడంలో నానోఫ్లేర్స్ దోహద పడుతున్నాయని సైంటిస్టులు అంచనా వేశారు.
ఇవి కూడా చదవండి : స్విస్ ఖండంలో కాక్టిస్ మొక్కల పెరుగుదల దేనికి సంకేతం !