- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టొమోటోతో క్షుద్రపూజలు.. హత్యలు చేయడానికీ ఆయుధమే..?
దిశ, ఫీచర్స్: భారతదేశంలో ప్రతీ వంటింట్లో కనిపించే టొమోటో.. మనందరికీ ఇష్టమే. దాని రంగు, రుచి కారణంగా ప్రియంగా మారిన ఈ పండు.. గతంలో పాయిజనస్ యాపిల్‌గా పిలవబడిందని మీకు తెలుసా? మంత్రవిద్యలు, చేతబడిలో వినియోగించిన ఈ రెడ్ ఫ్రూట్.. రాత్రి తోడేళ్లతో సావాసం చేసేందుకు, జనాన్ని భయపెట్టేందుకు ఉపయోగించబడిందని విన్నారా? టొమాటో ఏంటి.. మీరు చెప్పే కథలేంటి అనుకుంటున్నారు కదా. మనకు ఇప్పుడు సాధారణమే అయినా ఈ పండు.. 18వ శతాబ్దంలో జనాలను వణికించింది. గొప్ప గొప్ప రాజులు చనిపోయేందుకు కారణమైందనే అపరాధాన్ని మూటగట్టుకుంది. ఇంతకీ ఈ కథేంటో చూద్దాం.
పిల్లి ఎదురొస్తే చెడు జరుగుతుందని ఇప్పటికీ కొందరు ఎలాగైతే నమ్ముతున్నారో 18వ శతాబ్దం కాలంలో యూరప్, సౌత్ అమెరికాలో టొమాటోను చూసినా అలాగే అనుకునేవాళ్లు. ఇదంతా ఇప్పుడు హాస్యాస్పదంగా అనిపిస్తున్న అప్పుడు మాత్రం విషపూరితమైన పదార్థంగానే పరిగణించబడింది. 16వ శతాబ్దంలో దక్షిణ అమెరికాలోని ఆండియన్ ప్రాంతంలో మొదట గుర్తించబడిన ఈ పండును మొదట ఇంకాలు సాగుచేశారు. తర్వాత స్పానిష్ ఆక్రమణదారులచే ఐరోపాకు తీసుకురాబడింది. అయితే ప్రకాశవంతమైన రంగు, ప్రత్యేకమైన ఆకారం కలిగిన దీన్ని ముందుగా అలంకార ప్రయోజనాల కోసం వినియోగించారు. కానీ త్వరలోనే రుచికరమైన, పోషకమైన ఆహారం అని ప్రజలు గ్రహించడం ప్రారంభించారు.
Also Read: పచ్చిబఠాణీతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు! ఏంటో తెలుసా?
ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం పాకశాస్త్రంలో స్టార్ డమ్ పొందుతున్న టొమాటో.. ఆ స్టేజ్‌కు ఎదిగేందుకు భారీ సవాళ్లు ఎదుర్కొంది. కొందరు దాని రుచి, ఆకృతిని అసహ్యించుకున్నారు. విషపూరితమైనదని విశ్వసించారు. ఈ నమ్మకం అనేక అంశాలతో ముడిపడి ఉండగా.. ఇందులో ఒకటి టొమోటో నైట్‌షేడ్ మొక్కల కుటుంబానికి చెందినది కావడం. బెల్ పెప్పర్స్, బంగాళదుంపలు, వంకాయలు కూడా ఈ జాతికి చెందినవే కాగా.. ఈ ఫ్యామిలీ ప్లాంట్స్‌లో కొన్ని విషపూరితమైనవి అని పిలువబడ్డాయి. దీంతో టొమాటో కూడా పాయిజనస్ అని ప్రజలు భావించారు. 1700లలో ఐరోపాలోని జానపద కథల్లో ‘పాయిజన్ ఆపిల్’గా చెప్పబడింది కూడా. కారణం చాలా మంది రాజులు వాటిని తిన్న తర్వాత అనారోగ్యానికి గురయ్యారు. కానీ ఇక్కడ తప్పు టొమాటోది కాదు.. అసలు సమస్య వారు ఆహారం తీసుకునే ప్లేట్స్‌లోనే ఉంది. ఆ సమయంలో ప్లేట్స్ టిన్, సీసం మిశ్రమంతో తయారుచేయబడ్డాయి. అలా టొమాటోని ప్లేట్‌లోకి తీసుకున్నప్పుడు.. ఇందులోని నేచురల్ యాసిడ్స్ ప్లేట్‌లోని సీసంతో కెమికల్ రియాక్షన్‌కు గురయ్యాయి. అది కాస్త విషంగా మారింది. కానీ ఈ వాస్తవాన్ని గుర్తించని జనాలు టొమాటోనే నిందించారు.
ఇక మరో విషయం ఏంటంటే ఎరుపు రంగు టొమాటో రక్తంతో సంబంధం కలిగి ఉందని అనుకున్నారు అప్పటి ప్రజలు. బ్లడ్‌లా కనిపించే ఏదైనా వారిని అశాంతికి గురిచేస్తుందని, ప్రమాదకరమని భావించారు. ఇక టొమాటోకు చెడ్డ పేరు రావడానికి అతి పెద్ద కారణం మంత్ర విద్య, చేతబడితో అనుబంధం. 18వ శతాబ్దంలో చాలా మంది ప్రజలు మంత్రగత్తెలు, రాక్షసుల ఉనికిని విశ్వసించారు. చీకటి శక్తులు తమను వెంటాడుతాయని భయపడ్డారు. నిజానికి టొమాటోలు బ్లాక్ మ్యాజిక్‌తో సంబంధం కలిగి ఉన్నాయని నమ్మేందుకు కారణం వాటి శాస్త్రీయ నామం సోలనమ్ లైకోపెర్సికమ్. ఈ పేరు మొదటి భాగం ‘సోలనమ్’ లాటిన్ పదం కాగా దీని అర్థం ‘నైట్‌షేడ్’. రెండవ భాగమైన ‘లైకోపెర్సికమ్’.. గ్రీకు పదాలైన లైకోస్( అంటే తోడేలు), పెర్సికం(అంటే పీచు) నుంచి వచ్చింది. ఈ విచిత్రమైన పదాల కలయికతో టొమాటోకు రాత్రుళ్లు తోడేళ్లను పిలిపించే శక్తిని కలిగి ఉందని నమ్మారు. ఈ విశ్వాసం ప్రకారం మంత్రగత్తెలు తమ మాంత్రిక పానీయాలలో టొమాటోను కీలకమైన పదార్థంగా ఉపయోగించారు. తోడేళ్లు, ఇతర చీకటి జీవులను పిలవడానికి వినియోగించారు. ఈ ఆలోచన అనేక జనాదరణ పొందిన కథలు, ఇతిహాసాల ద్వారా బలపరచబడింది. ఈ క్రమంలో శపించబడతారేమోననే భయంతో కొందరు వాటిని తాకడానికి కూడా భయపడేవారు.
అదృష్టవశాత్తూ కాలక్రమేణా శాస్త్రీయ వాదనలు, రుజువుల కారణంగా.. టొమోటో విషపూరితం లేదా దెయ్యంతో సంబంధం లేనివని ప్రజలు గ్రహించడం ప్రారంభించారు. దీంతో 19వ శతాబ్దంలో అనేక ఇటాలియన్, స్పానిష్ వంటకాలలో ప్రధానమైన పదార్థంగా మారాయి. చాలా తక్కువ కాలంలోనే యూరప్, అమెరికాలోని ఇతర ప్రాంతాలకు వ్యాపించాయి. మొత్తానికి దెయ్యాలకు దగ్గరి సంబంధం కలిగి ఉందని పరిగణించబడిన టొమాటో ప్రస్తుతం పాకశాస్త్రాన్ని ఏలుతున్న సూపర్ స్టార్‌గా ఎదిగేవరకు సాగిన ప్రజాభిప్రాయానికి నిదర్శనం కాగా మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకునేందుకు ఎంత దూరం వచ్చామో తెలిపేందుకు సాక్ష్యం కూడా.