Hi Salary Jobs : అత్యధిక జీతం పొందగలిగే ఉద్యోగాలివే.. 2050 నాటికి ఫుల్ డిమాండ్!

by Javid Pasha |   ( Updated:2024-12-09 07:55:46.0  )
Hi Salary Jobs : అత్యధిక జీతం పొందగలిగే ఉద్యోగాలివే.. 2050 నాటికి ఫుల్ డిమాండ్!
X

దిశ,ఫీచర్స్: చదువుకున్న ప్రతీ ఒక్కరి కల ఏదో ఒక ఉద్యోగం సంపాదించడమే. జీవితంలో అదొక అత్యవసరమైపోయింది. ప్రస్తుతం అర్హతలు, నైపుణ్యాలు, అనుభవాలను బట్టి ఏదో ఒక రంగంలో ఉద్యోగాలు దొరుకుతున్నాయి. దాదాపు అన్ని సెక్టార్టలలోనూ అర్హతలకు తగినట్లుగా సాలరీలు కూడా వస్తున్నాయి. కానీ 2050 నాటికి జాబ్ మార్కెట్లో మరిన్ని మార్పులు వస్తాయని నిపుణులు అంటున్నారు. అయితే ఇండియాలో హయ్యెస్ట్ సాలరీలు పొందగలిగే ఉద్యోగాలు కూడా ఆయా రంగాల్లో మాత్రమే ఉండవచ్చుననే అంచనాలు ఉన్నాయి. అవేమిటో చూద్దాం.

రోబోటిక్ ఇంజనీర్లు

భవిష్యత్‌లో రూ. 40 నుంచి రూ. 80 లక్షల వరకు జీతం పొందగలిగే మస్తు డిమాండ్ ఉండే మరో ప్రొఫెషన్ రోబోటిక్ ఇంజనీర్లు. వీరు మెకానికల్, ఎలక్ట్రికల్, కంప్యూటర్ ఇంజనీరింగ్ సూత్రాలు, టెక్నాలజీని ఉపయోగించి రోబోట్లు, రోబోటిక్ సిస్టమ్‌లను డెవలప్ చేయాల్సి ఉంటుంది. ఇందులో యాక్యుయేటర్లు, మోటార్లు, సెన్సార్లు అవసరమైన భాగాల ఎంపిక, ఏకీకరణతో కూడిన కంట్రోలర్లు ఉంటాయి. 2050 నాటికి అత్యధిక జీతాలు పొందగలిగే ప్రొఫెషన్‌లలో ఇదొకటి.

ఏఐ నిపుణులు

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం రోజు రోజుకూ కొత్త పుంతలు తొక్కుతోంది. ప్రస్తుతం ఏఐ ఆధారిత చాట్‌బాట్‌లు అందులో భాగమే. కాగా 2050 నాటికి అత్యధికంగా జీతాలు చెల్లించగలిగే ఉద్యోగాల జాబితాలో ఏఐ నిపుణులు ఉండనున్నారని నివేదికలు పేర్కొంటున్నాయి. ఏఐ సిస్టమ్స్‌ను, అప్లకేషన్లను రూపొందించడానికి, డెవలప్ చేయడానికి, పరీక్షించి అమలు చేయడానికి ఈ ప్రొఫెషన్ క్రియేట్ చేయబడింది. పైగా ఏఐ నిపుణులకు మెషిన్ లెర్నింగ్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, కంప్యూటర్ విజన్, రోబోటిక్స్ లేదా డీప్ లెర్నింగ్ సహా వివిధ సెక్టార్టలో ఉద్యోగాలు ఫుల్ డిమాండ్ పెరగనుంది. జీతం విషయానికి వస్తే ఏడాదికి రూ. 50 లక్షల నుంచి కోటి వరకు పొందే చాన్సెస్ ఉంటాయి.

మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్లు

డేటా సైన్స్‌ విభాగాల్లో, టీమ్‌లలో కీలకపాత్ర పోషించే నిపుణులుగా 2050 నాటికి మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్ల అవసరం మరింత పెరగనుంది. రూ. 45 లక్షల నుంచి రూ. 90 లక్షల వరకు వార్షిక వేతనం పొందగలిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. దీంతోపాటు ఏఐ పరిశోధనలు, అభివృద్ధి, రూపకల్పన వంటివి మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్ల ప్రొఫెషన్‌లో భాగంగా ఉంటాయి.

డేటా సైంటిస్టులు

ఆయా రంగాల్లో మెరుగైన సమాచారాన్ని సేకరించడానికి, విశ్లేషించడానికి డేటా సైంటిస్టుల అవసరం పెరుగుతోంది. 2050 నాటికి వీరికి మరింత డిమాండ్ పెరగనుందనే అంచనాలు ఉన్నాయి. ఏఐ ఆధారిత టెక్నాలజీని వినియోగించుకొని గణితం, గణాంకాలు, కంప్యూటర్ సైన్స్ నాలెడ్జ్ వంటి ప్రొఫెషన్లు మరిన్ని క్రియేట్ అవుతాయి. ప్రస్తుతం వాతావరణ విభాగాల్లో డేటా సైంటిస్టుల పాత్ర చాలా కీలకం. అలాగే బిజినెస్ సెక్టార్‌లో వీరి సేవలు ఇంకా అవసరం అవుతాయి. కాబట్టి భవిష్యత్‌లో రూ. 35 లక్షల నుంచి రూ. 75 లక్షల వార్షిక వేతనంతో అత్యధిక సాలరీలో పొందగలిగే ఉద్యోగాల జాబితాలో డేటా సైంటిస్టులు కూడా ఉంటారు.

క్వాంటం కంప్యూటింగ్ రీసెర్చర్స్

ఫ్యూచర్‌లో క్వాంటం కంప్యూటర్ల కోసం అల్గారిథమ్‌లను మూల్యాంకనం చేయడంక్వాంటం కంప్యూటింగ్ రీసెర్చింగ్ ప్రొఫెషన్‌లో భాగం. విశ్లేషణలు, నిర్వచనాలు, కోడింగ్ వంటివి డెవలప్ చేయడం వంటి ఈ ఉద్యోగుల ప్రధానమైన విధి. పైగా వీరికి భౌతిక శాస్త్రంపట్ల తగిన అవగాహన ముఖ్యం. ప్రస్తుతం వీరి కొతర ఉంది. కాగా 2050 నాటికి వీరికి ఫుల్ డిమాండ్ పెరగనుందని నివేదికలు పేర్కొంటున్నాయి. రూ. 40 లక్షలు మొదలు కొని రూ. 85 లక్షల వరకు జీతం పొందగలిగే ఉద్యోగాలు వీరికోసం ఎదురు చూస్తాయంటున్నారు నిపుణులు.

బయో టెక్నాలజీ రీసెర్చర్స్

జీవశాస్త్రం, బయో కెమిస్ట్రీ లేదా బయో మెడికల్ ఇంజనీరింగ్‌ను స్టడీ చేసే సైంటిస్టులను బయోటెక్నాలజీ రీసెర్చర్స్ అంటారు. వీరు ఫార్మా స్యూటికల్స్‌తో పాటు వ్యవసాయం, పర్యావరణం సహా వివిధ ఉత్పత్తుల రంగాలలో టెక్నాలజీని డెవలప్ చేయడానికి పనిచేస్తారు. అలాగే జీవుల రసాయన కూర్పు ప్రాసెస్‌పై పరిశోధనలు నిర్వహిస్తారు. ఆహారాలు, మందులు, ఇతర పదార్థాలు, జీవులపై వాటి ప్రభావం తదిర అంశాలను నిరంతరం అధ్యయనం చేయాల్సి ఉంటుంది. 2050 నాటికి ఇదొక ప్రధాన సెక్టార్‌గా మారనుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఈ రంగంలో రూ. 30 లక్షల నుంచి రూ. 80 లక్షల వరకు జీతంతో ఉద్యోగాలు లభించే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.

Advertisement

Next Story