High Blood Pressure: హైబీపీ వెంటనే కంట్రోల్ అవ్వాలంటే.. ఈ జ్యూస్ తాగితే చాలట!

by Prasanna |   ( Updated:2023-03-12 17:18:22.0  )
High Blood Pressure: హైబీపీ వెంటనే కంట్రోల్ అవ్వాలంటే.. ఈ జ్యూస్ తాగితే చాలట!
X

దిశ, వెబ్ డెస్క్ : కీర దోసకాయలో నీటి శాతం అధికంగా ఉంటుంది. దీన్ని తీసుకోవడం వల్ల శరీరం డీహైడ్రేటెడ్ అవ్వకుండా ఉంటుంది. కాబట్టి దోసకాయ మన ఆరోగ్యాన్ని ఎల్లప్పుడూ కాపాడుతుంది. అలాగే దోసకాయ జ్యూస్ చేసుకొని తాగడం వల్ల మీ శరీరం బలంగా తయారవుతుంది. బరువు పెరుగుతున్న వారికి ఇది మంచిగా ఉంటుంది. అలాగే అధిక రక్తపోటు కూడా అదుపులో పెట్టవచ్చు.

కీర దోసకాయ జ్యూస్ తయారీ విధానం గురించి ఇక్కడ తెలుసుకుందాం.

కావలిసిన పదార్ధాలు :

కీర దోసకాయలు - 2

అల్లం పేస్ట్ - 1/2 టేబుల్ స్పూన్

నిమ్మకాయ రసం - 1 టేబుల్ స్పూన్స్

కొత్తిమీర ఆకులు, పుదీనా, రుచికి తగినంత ఉప్పు.

తేనె -1 టేబుల్ స్పూన్

తయారీ విధానం :

కీర దోసకాయల జ్యూస్ తయారు చేయడానికి ముందుగా దోసకాయను నీటితో శుభ్ర పర్చాలి. తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కోసి ఒక గిన్నెలో పెట్టుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర ఆకులు, పుదీనా ఆకులను పేస్ట్‌గా చేసుకోవాలి. మిక్సర్ జార్లో దోసకాయ ముక్కలు, కొత్తిమీర పేస్ట్ అల్లం పేస్ట్ , నిమ్మకాయ రసం, నీరు పోసి బాగా గ్రైండ్ చేసుకోవాలి. గ్లాస్లో వడకట్టి తాగండి.

ఇవి కూడా చదవండి : తరచూ ఇన్ఫెక్షన్లు ఎందుకొస్తాయో తెలుసా?

Advertisement

Next Story