- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బరువు తగ్గడానికి ఆ పని చేస్తున్నారా.. అయితే గుండెపోటుతో చనిపోవడం ఖాయం!
దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం గుండె పోటుతో మరణాల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. మనతో సరదాగా మాట్లాడినవారు కూడా ఉన్నట్లుండి, హార్ట్ ఎటాక్‌తో చనిపోతున్నారు. మనం తీసుకునే ఆహారం, జీవన శైలి, హెవీ వర్క్ ఔట్స్, వేయిట్ లాస్ కోసం చేసే డైట్ వీటన్నింటి వలన అనారోగ్య సమస్యలనేవి పెరిగిపోతున్నాయి. దీంతో కొందరు ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా అధిక బరువుతో బాధపడేవారు బరువు తగ్గేందుకు వ్యాయామం, డైట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఎక్కువగా చేస్తుంటారు. అయితే ఈ ఫాస్టింగ్ వల్ల గుండె సమస్యలు వచ్చే అవకాశం అధికంగా ఉందని అంటున్నారు నిపుణులు. తాజాగా పరిశోధకులు చేసిన ఓ అధ్యయనంలో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వలన హార్ట్ ఎటాక్‌తో మరణించే ఛాన్స్ ఎక్కువ ఉందని తేలినట్లు వారు పేర్కొన్నారు.
అసలు విషయంలోకి వెళ్లితే..అమెరికన్ హార్ట్ అసోసియేషన్, నేషనల్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ ఎగ్జామినేషన్ సర్వే కోసం సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ద్వారా డేటాను సేకరించింది.49 సంవత్సరాల వయసు ఉన్న వారి డేటా తీసుకొని,వారి ఆహార విధానాలు ట్రాక్ చేసింది.అయితే అందులో కొందరు బరువు తగ్గేందుకు, తమ భోజన సమయాలను కేవలం ఎనిమిది గంటలకు మాత్రమే పరిమితం చేశారని, అలాంటి వారు గుండె జబ్బులతో మరణించే ప్రమాదం 91 శాతం ఉన్నట్లు సర్వేలో తేలింది. అందువలన బరువు తగ్గడానికి ఆహారాన్ని కంట్రోల్ చేసి ప్రాణాల మీదకు తెచ్చుకోకూడదు అంటున్నారు నిపుణులు.