కాలేయ వ్యాధులను దూరం చేసే అద్భుత ఫలాలు ఇవే.. అప్పుడప్పుడూ తిన్నా ఎంతో మేలంటున్న నిపుణులు

by Javid Pasha |
కాలేయ వ్యాధులను దూరం చేసే అద్భుత ఫలాలు ఇవే.. అప్పుడప్పుడూ తిన్నా ఎంతో మేలంటున్న నిపుణులు
X

దిశ, ఫీచర్స్ : మనం ఆరోగ్యంగా ఉండాలంటే శరీరంలోని ఇతర అవయవాలతో పాటు కాలేయం పనితీరు మెరుగ్గా ఉండాలి. ఒక వేళ లివర్‌‌లో ఏవైనా లోపాలు, సమస్యలు తలెత్తితే ప్రాణానికే ప్రమాదం ఏర్పడవచ్చు. ఇటీవల పలువురిని వేధిస్తున్న ఆరోగ్య సమస్యల్లో హార్ట్ ఎటాక్ తర్వాత లివర్ ఫెయిల్యూర్, లివర్ సిర్రోసిస్, హెపటైటిస్ వంటి వ్యాధులు కూడా ఉంటున్నాయని వైద్య నిపుణులు చెప్తున్నారు. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, కాలేయ ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాలు, పండ్లు తప్పక తీసుకోవాలని సూచిస్తు్న్నారు. అవేమిటో చూద్దాం.

బ్లాక్ అండ్ బ్లూ బెర్రీస్

చాలా మందికి బెర్రీస్ గురించి తెలుసు. వీటిలో బ్లాక్ అండ్ బ్లూ కలర్ బెర్రీస్ కూడా ఉంటాయి. ఈ మధ్య కుర్ కురే, చిప్స్ తిన్నంతగా కూడా వీటిని తినడానికి పలువురు ఆసక్తి చూపడం లేదు. కానీ కాలేయం హెల్తీగా ఉండాలంటే తప్పక తినాలంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఇవి కాలేయం డ్యామేజ్ కాకుండా కాపాడే అద్భుత పోషకాలను కలిగి ఉంటాయి. వీటిని తిన్న తర్వాత కడుపులో సూపర్ ఆక్సిడైజ్ ఫార్ములేషన్ ప్రక్రియను జరిగి లివర్ కణాలను దృఢంగా తయారు చేస్తుంది. డిటాక్సినేషన్ కూడా స్పీడప్ అవుతుంది. ఫలితంగా కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది.

జామపండ్లు - అవకాడో

మనకు నిత్యం అందుబాటులో ఉండే జామపండ్లల్లో కూడా లివర్ హెల్త్‌ను కాపాడే ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. విటమిన్ సి కలిగి ఉన్నందువల్ల లివర్‌లో‌ని విష పదార్థాలను ఫిల్టర్ చేసి, బయటకు పంపండంలో జామపండ్లు సహాయపడతాయి. ఇక అవకాడో గురించి చెప్పుకుంటే.. ఇందులో గ్లూటాథియోన్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది లివర్ డిటాక్సినేషన్‌కు చాలా ముఖ్యం. ఫ్యాటీ లివర్ సమస్యను కూడా దూరం చేస్తుంది. కాబట్టి కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనుకునే వారు అప్పుడప్పుడైనా అవకాడోను ఆహారంలో భాగంగా తీసుకోవడం మంచిది.

Advertisement

Next Story