యువతలోనూ హైపర్ టెన్షన్.. తగ్గించుకునే మార్గాలివే

by Prasanna |   ( Updated:2023-05-28 09:54:05.0  )
యువతలోనూ హైపర్ టెన్షన్.. తగ్గించుకునే మార్గాలివే
X

దిశ, ఫీచర్స్ : ఒకప్పుడు ఏజ్‌బార్ వ్యక్తులకే హైబీపీ సమస్యలు అధికంగా ఉండేవి. కానీ ప్రస్తుతం 30 ఏళ్లలోపు వారిని కూడా ఈ సమస్యలు వేధిస్తున్నాయి. కొన్ని జెనెటిక్ ఫ్యాక్టర్స్ కారకాలు, మరికొన్ని జీవనశైలి ఎంపికలు కూడా కారణం ఇందుకు కారణం అవుతున్నాయి. హైపర్ టెన్షన్ కారణంగా యూత్‌లోనూ గుండె జబ్బులు, స్ట్రోక్, ఇతర తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఇటీవల పెరుగుతున్నాయి. అయితే ఆహార నియమాలతోపాటు వివిధ నివారణ చర్యలు పాటిచండం రక్తపోటును కంట్రోల్ చేయడంలో సహాయడతాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.

ఆహార నియమాలు

ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా హైబీపీని నివారించవచ్చు. ముఖ్యంగా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్లతో కూడిన ఫుడ్ తరచూ తీసుకుంటూ ఉండాలి. సోడియం(salt)‌ మాత్రం స్థాయికి మించి తీసుకోవద్దు. ఎందుకంటే ఇది రక్తపోటును పెంచుతుంది. లో సోడియం, హై పోటాషియంతో కూడిన డైట్ హైపర్‌టెన్షన్‌ను తగ్గించడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది.

అధిక బరువు

ఊబకాయం(Obesity), అధిక బరువు హైపర్‌టెన్షన్‌తో దగ్గరి సంబంధం కలిగి ఉంటాయి. ఓవర్ వెయిట్ అనేది కార్డియో వాస్క్యులర్ వ్యవస్థపై ఒత్తిడిని పెంచుతుంది. ఈ పరిస్థితి రక్తపోటు పెరుగుదలకు దారితీస్తుంది. రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీస్, బ్యాలెన్స్‌డ్ డైట్ మెయింటెన్ వల్ల రిస్క్ తగ్గడంతోపాటు ఆరోగ్యకరమైన బరువును సాధించడంలో సహాయపడుతుంది.

శారీరక శ్రమ

రెగ్యలర్ వ్యాయామం మొత్తం కార్డియో వాస్క్యులర్ హెల్త్‌కు, అధిక రక్తపోటు నివారణకు దోహద పడుతుంది. వారానికి కనీసం 150 నిమిషాల పాటు చురుకైన నడక, సైక్లింగ్ లేదా స్విమ్మింగ్ వంటి తక్కువ-తీవ్రత గల (moderate-intensity) ఏరోబిక్ కార్యకలాపాలలో పాల్గొనడం మంచిదని వైద్య నిపుణులు చెప్తు్న్నారు.

ఆల్కహాల్

ఆల్కహాల్ తీసుకోవడం రక్తపోటు ప్రమాదాన్ని ప్రేరేపిస్తుంది. కాబట్టి తీసుకోకపోవడం మంచిది. పూర్తిగా నివారించలేని పరిస్థితి ఉన్నవారు కనీసం దానిని చాలా వరకు పరిమితం చేయాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఇప్పటికే హైపర్‌టెన్షన్ లేదా ఇతర ఆరోగ్య పరిస్థితులు ఉన్నవారు పూర్తిగాదూరంగా ఉండటమే చాలా మంచిది.

స్మోకింగ్

స్మోకింగ్ చేయడం లేదా వివిధ రూపాల్లో పొగాకు వాడకం, అలాగే ఇతరులు స్మోక్ చేస్తున్నప్పుడు పొగను పీల్చడంవల్ల కూడా రక్తపోటు గణనీయంగా పెరుగుతుంది. శరీరంలోని రక్త నాళాలు దెబ్బతింటాయి. అందుకే రక్తపోటును, దానివల్ల సంభవించే గుండె జబ్బుల రిస్కును నివారించడానికి ధూమపానం మానేయడం చాలా ముఖ్యం.

స్ట్రెస్ మేనేజ్‌మెంట్

దీర్ఘకాలిక ఒత్తిడి(Chronic stress) అధిక రక్తపోటుకు దోహదం చేస్తుంది. డీప్ బ్రీతింగ్, యోగా, రిలాక్సేషన్ టెక్నిక్స్ వంటి హాబీలు ఏర్పర్చుకోవడం ద్వారా మానసిక ఒత్తిడిని దూరం చేసుకోవచ్చు. దీంతోపాటు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, జీవన శైలిని ఏర్పర్చుకోవడం వంటివి రక్తపోటు ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.

Also Read..

డబ్బు ఖర్చు పెట్టడం వారికి తెలియదా?.. ఇప్పటికీ కొనసాగుతున్న మూసధోరణులు

Advertisement

Next Story