- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బోడ కాకర కనిపిస్తే అస్సలు వదలొద్దు.. వీటిని తింటే ఎన్ని ప్రయోజనాలంటే!
దిశ, ఫీచర్స్: ప్రస్తుతం వర్షాకాలం పలు రకాల సీజనల్ వ్యాధులు వస్తాయి. అలాగే సీజనల్ పండ్లు, కూరగాయలు మార్కెట్‌లో లభిస్తూ అనారోగ్య సమస్యల నుంచి మనల్ని మనం కాపాడుకునేలా చేస్తాయి. అయితే ఈ సీజన్‌లో చికెన్, మటన్ కంటే కూడా రుచికరంగా.. శరీరానికి పోషకాలను అందజేయడంలో బోడకాకర ముందుంటుంది. ఇవి మార్కెట్లో విరివిగా లభిస్తుంటాయి. కాబట్టి వాటిని అస్సలు వదిలిపెట్టకుండా. కొనుగోలు చేసి బోడకాకరతో అనేక రకాల వెరైటీలు చేసుకుని తింటే ఆరోగ్యానికి చాలా మంచిది.
అయితే వీటిని ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా పిలుస్తుంటారు. అడవి కాకర, బొంతు కాకర, బోడకాకర అని అంటుంటారు. వర్షాకాలం బోడకాకరకు అధిక రేటు ఉన్నప్పటికీ వీటిని తినడం వల్ల ప్రయోజనాలు కూడా మెండుగా ఉంటాయి. చిన్నా పెద్ద కచ్చితంగా తినాల్సి కూరగాయ అని నిపుణులు సలహా ఇస్తున్నారు. వాటిలో ఉండే విటమిన్లు, జింక్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, సోడియం, ఫ్లవనాయిడ్లు, ఫైబర్, ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు ఉండి పలు రకాల అనారోగ్య సమస్యలను తరిమికొడతాయి.
* వర్షాకాలం వచ్చే కడుపు ఇన్ఫెక్షన్ కు చెక్ పెట్టడంలో బోడ కాకర ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే చికెన్, మటన్ కంటే కూడా చాలా రుచిగా ఉండి మీకు లాభాలు చేకూరుస్తాయి.
* చాలామందికి జీర్ణ సమస్యలు ఎదురవుతూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంటాయి. అయితే అలాంటి వారు మీ ఆహార పదార్ధాల్లో బోడకాకర యాడ్ చేసుకోవడం బెటర్. ఇందులో ఉండే పీచు పదార్థం జీర్ణ సమస్యలను తగ్గించి జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
*వర్షాకాలం ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోవడం వల్ల ఎన్నో రకాల సమస్యలు తలెత్తి నానా తంటాలు పడేలా చేస్తాయి. ఎన్ని జాగ్రత్తలు పాటించనప్పటికీ లాభం లేకుండా పోతుంది. అయితే రోగాలు రాకుండా ఉండేందుకు రోగనిరోధక శక్తిని పెంచుకోవాలనుకోవాలనుకునేవారు బోడకాకరను కచ్చితంగా తినాలి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
*బోడ కాకరలో ఉండే గుణాలు రక్తంలోని చక్కెర నిల్వలను తగ్గించడంలో సహాయ పడతాయి. కాబట్టి వీటిని షుగర్ పేషెంట్స్ కూడా తినడం చాలా ప్రయోజనకరం.
*అలాగే రక్తపోటు తగ్గాలనుకునేవారు ఈ బోడకాకర సీజన్ అయిపోయేలోపు వీటిని వారానికి ఒక్కసారైనా తినాలి. కిడ్నీలో రాళ్ల సమస్య రాకుండా ఉండాలంటే వాటిని కచ్చితంగా తినాలని నిపుణులు చెబుతున్నారు.
* ఇటీవల కాలంలో చాలా మందికి వయసుతో సంబంధం లేకుండా వృద్ధాప్య లక్షణాలు, ముడతలు వంటివి వస్తున్నాయి. అయితే అలాంటి వాటిని దూరం చేయడంలో బోడకాకర కీలక పాత్ర పోషిస్తుంది. ఫ్లవనాయిడ్లు ఉండటం వల్ల కాస్త ఉపశమనం కలుగుతుంది. అలాగే బోడకాకర వల్ల అజీర్తి, మలబద్ధకం, గ్యాస్ట్రిక్ అల్సర్ వంటివి తగ్గుతాయి.
గమనిక: పైన ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా తీసుకోబడింది. దీనిని కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే అందించాము.