ఈ లక్షణాలు ఉన్న వారు జాగ్రత్త.. ఆ వ్యాధితో పోరాడుతున్నట్లే!

by Jakkula Samataha |
ఈ లక్షణాలు ఉన్న వారు జాగ్రత్త.. ఆ వ్యాధితో పోరాడుతున్నట్లే!
X

దిశ, ఫీచర్స్ : కొంతమంది తమకు తెలియకుండానే వారు వ్యాధితో పోరాడుతున్నారు. మానసిక వ్యాధులలో ఓసీడీ ఒకటి. ఈ వ్యాధి ఉన్న వ్యక్తి మానసికంగా చాలా ఇబ్బందులు పడుతుంటారు. చేసిన పనినే మళ్లీ చేయడం, కొంచెం నీట్ నెస్ లేకపోయినా అక్కడ ఉండటానికే భయపడటం, కడిగిన ప్లేట్స్, గ్లాసెస్ మళ్లీ కడగడం, ఎక్కువగా శుభ్రత గురించి ఆలోచించడం ఇవన్నీ ఓసీడీ లక్షణాలే.

మెదడులోని సెరోటోనిన్ అనే న్యూరో ట్రాన్స్ మీటర్ అసమతుల్యత వలన ఈ ఓసీడీ సమస్య మొదలవుతుంది. దీనినే అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్, ఓసీడీ అంటారు.ఈ వ్యాధి వలన యూత్ ఎక్కువ ఒత్తిడిని ఎదుర్కొంటున్నారంట. దీని వలన వారు తమ స్నేహితులతో, సన్నిహితులతో ఎక్కువ క్లోజ్‌గా మూవ్ కాలేకపోతున్నారని, చేసిన పనినే మళ్లీ చేయడం వలన విసుగు, ఒత్తిడికి లోను అవుతున్నట్లు సర్వేలో తేలింది. అంతే కాకుండా ఈ మధ్య ఓసీడీ ఆత్మహత్యలను కూడా ప్రేరేపిస్తుందని విన్నాం. అయితే ఈ వ్యాధి అనేది వయసుతో సంబంధం లేకుండా ఎవరికైనా వచ్చే అవకాశం ఉటుదంట. చాలా మంది ఇప్పటికే ఈ వ్యాధి బారిన పడి దాంతో పోరాటం చేస్తున్నా.. ఇది ఒక వ్యాధి అని గుర్తించలేకపోతున్నారు. ఓసీడీ బారిన పడిన వారు రోజువారీ కార్యకలాపాలు సవ్యంగా చేయలేరు. కడిగిన చోటే పదే పదే శుభ్రపరుస్తూ సమయాన్ని వేస్ట్ చేస్తారు అంటున్నారు నిపుణులు.

Advertisement

Next Story

Most Viewed