Fruits Stickers : మనం రోజూ తినే పండ్లపై స్టిక్కర్లను మీరెప్పుడైనా గమనించారా..? వాటి అర్థం ఇదే!

by Javid Pasha |
Fruits Stickers : మనం రోజూ తినే పండ్లపై స్టిక్కర్లను మీరెప్పుడైనా గమనించారా..? వాటి అర్థం ఇదే!
X

దిశ, ఫీచర్స్ : మనం ఆరోగ్యంగా ఉండంటంలో వివిధ రకాల పండ్లు కీలకపాత్ర పోషిస్తాయనే విషయం తెలిసిందే. అందుకే కనీసం అప్పుడప్పుడైనా తప్పక తినాలని నిపుణులు సూచిస్తుంటారు. ముఖ్యంగా యాపిల్స్, ఆరెంజ్, స్ట్రా బ్రెర్రీలు, అరటి, డ్రాగన్ వంటి పండ్లతోపాటు ఆయా సీజన్లలో మాత్రమే లభించే నేరేడు, సీతాఫలాలు వంటివి కూడా ఉంటాయి. అయితే మీరు మార్కెట్లో ఫ్రూట్స్ కొనుగోలు చేసేటప్పుడు వాటిపై స్టిక్కర్లను ఎప్పుడైనా గమనించారా?.. అవి ఎందుకు ఉంటాయి?, వాటిపై నెంబర్లకు గల అర్థం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

నాణ్యత, పండించిన తీరుకు సూచిక : నిజానికి ఆరెంజ్, యాపిల్ పండ్లపైనే ఎక్కువ సందర్భాల్లో స్టిక్కర్లు కనిపిస్తుంటాయి. అయితే ఇవి వాటిని పండించిన విధానానికి, అలాగే మన ఆరోగ్యానికి సంబంధించిన సూచికలుగా నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా స్టిక్కర్లపై గల నెంబర్లు పండ్ల క్వాలిటీని, పండించిన తీరును తెలియజేస్తాయి. అంటే వాటిని సేంద్రీయ పద్ధతుల్లో పండించారా? లేక కెమికల్స్ ఉపయోగించడం ద్వారా పండించారా? అనేది తెలుసుకోవచ్చు.

నెంబర్ 4: కొన్ని రకాల పండ్లకు అంటించిన స్టిక్కర్లపై 4 అంకెతో ప్రారంభమైన సంఖ్య ఉంటుంది. ఉదాహరణకు 4879 లేదా 4058 ఇలా నెంబర్లు కనిపిస్తుంటాయి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే.. నాలుగు నెంబర్‌తో ప్రారంభమైన స్టిక్కర్ కలిగి ఉన్నప్పుడు ఆ పండ్లు పురుగు మందులు, వివిధ రకాల రసాయనాలను పిచికారి చేయడం ద్వారా పండించారని అర్థం. అందుకే వీటిని తక్కువ ధరకు కూడా అమ్ముతుంటారు.

నెంబర్ 8 : ఇక 8 అంకెతో ప్రాంరభమైన స్టిక్కర్ ఉన్న పండ్లకు అర్థం ఏంటంటే.. అవి జన్యు మార్పిడి ద్వారా పండించినవి. అంటే ఇవి సహజమైనవి కావు. సాధారణ పురుగు మందుల పిచికారితో పండించినవి కాబట్టి రసాయనాలు పిచికారి చేసిన పండ్లకంటే కాస్త ఎక్కవ ధర పలుకుతాయి.

నెంబర్ 9 : పండ్లపై 9 అంకెతో ప్రారంభమైన స్టిక్కర్ ఉంటే గనుక ఆ పండ్లను పురుగు మందులు, కెమికల్స్ వంటివి ఏమాత్రం ఉపయోగించకుండా, పూర్తి సేంద్రియ పద్ధతిలో పండించారని అర్థం. ఉదాహరణకు యాపిల్, ఆరెంజ్ పండ్లపై 98265 వంటి నెంబర్ ఉందనుకోండి అవి సహజ సిద్ధంగా పండించినవి. కాబట్టి వీటి ధర కూడా ఎక్కువగా ఉంటుంది.

Advertisement

Next Story

Most Viewed